
ప్రపంచంలో ఒక్కొక్కరు ఒకలా జీవిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అచ్చం ఓకేలా ఇద్దరు ఎప్పటికీ ఉండరు. ఇకపోతే కొందరు తమ శాడిజం వేరే వారిపై ప్రదర్శిస్తూ ఆనందం పొందుతుంటారు. ఇందులో భాగంగా ఆడవారిని టీజ్ చేయడం, అలాగే చిన్నపిల్లలను ఏడిపిస్తూ వారు ఆనందపడుతుంటారు. మరికొందరైతే మూగజీవాలను హింసిస్తూ వారి శునకానందాన్ని పొందుతారు. ఇలాంటి వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం ఉన్నాయి.
Also Read: Middle East tensions: ఇజ్రాయిల్, ఇరాన్ వెళ్లొద్దని భారతీయులకు కేంద్రం కీలక ఆదేశాలు..
ఇకపోతే తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి పడుకున్న ఆవులను హింసించుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఇదే క్రమంలో అతడికి జరగాల్సిన శాస్తి అప్పుడే జరిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పైశాచికంగా ప్రవర్తించిన యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు తెలియకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో అనేకమంది ఈ వీడియో పై కామెంట్ చేస్తున్నారు.
Also Read: Manushi Chhillar: పొట్టి గౌనులో పరేషాన్ చేస్తున్న వరుణ్ బ్యూటీ..
రాత్రి సమయంలో ఇద్దరు యువకులు నడుచుకుంటూ వెళ్తుండగా అదే సమయంలో దారి మధ్యలో పడుకొని ఉన్న ఆవుల గుంపు ఒకటి వారి కంటికి కనబడుతుంది. అయితే అలా పడుకున్న ఆవుల్ని సూదులతో గుచ్చుతూ ఆనందం పొందుతున్నారు. అంతటితో ఆగకుండా ఓ అబ్బాయి ఆవు మెడ పట్టుకొని కింద పడేయాలని ప్రయత్నిస్తాడు. అయితే అన్ని ఆవులు ఒకేలా ఉండవు కదా.. మెడ పట్టుకోవడంతో వెంటనే ఆవు ఆగ్రహంతో ఒక్క తన్ను తన్నింది. అంతే ఆ దెబ్బకు యువకుడు పక్కన ఎగిరిపడ్డాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ఇలాంటి వారికి ఇలాగే శిక్ష పడాలంటూ అంటుండగా.. మరికొందరైతే ఈ ఆవు బాగానే బుద్ధి చెప్పిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
@gharkekalesh pic.twitter.com/L8mq7YzpYC
— Arhant Shelby (@Arhantt_pvt) April 11, 2024