Purandeswari: ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కు పురంధేశ్వరి లేఖ.. వారికి ఎన్నికల విధులు కల్పించొద్దని ఫిర్యాదు..

2024 సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కొన్ని రాజకీయ పార్టీల ప్రభావంతో పలువురు జిల్లా కలెక్టర్లు, బ్యూరోక్రసీలోని కొందరు ఉన్నతాధికారులు వచ్చే రెండు నెలల పాటు దేవాదాయ శాఖ సిబ్బంది సేవలను వినియోగించుకోవద్దని ఏపీ చీఫ్ ఎన్నికల ప్రధాన అధికారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి లేఖ రాసింది. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ సిబ్బంది సాధారణంగా తమ పరిధిలోని దేవాలయాల్లో రోజువారీ పరిపాలనా విధులు నిర్వర్తిస్తారు.. పరిపాలనలో ఏదైనా అంతరాయం ఏర్పడితే భక్తులకు ఇబ్బందులు తప్పవు.. దేవాదాయ సిబ్బంది నిర్వహించే నిర్దిష్ట విధులను ఆపలేము అని ఆమె పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో దేవాదాయశాఖల సిబ్బంది సేవలు అనివార్యం.. దేవాదాయ శాఖ సిబ్బందిని ఎన్నికల విధులకు నియమిస్తే హిందూ మతానికి చెందిన వారి సేవలను మాత్రమే వినియోగించుకుంటున్నారని నిరాధార ఆరోపణలు వస్తాయి.. ఏప్రిల్, మే, జూన్ కాలం ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తుంది.. ఉగాది, శ్రీరామనవమి, చందనోత్సవం, నృసింహ జయంతి, బ్రహ్మోత్సవాలు, గ్రామ దేవత వార్షిక వేడుకలు మొదలైన అనేక పండుగలు వస్తాయని పురంధేశ్వరి పేర్కొనింది.
Read Also: P Chidambaram: 2019 ఎన్నికల కన్నా 2024లో కాంగ్రెస్‌కి ఎక్కువ సీట్లు వస్తాయి..
పాఠశాలలు, కళాశాలలకు సెలవుల సీజన్ కావడం వల్ల దేవాలయాలను సందర్శించే యాత్రికులు అనేక రెట్లు పెరిగారు అని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. దేవాలయాల్లో యాత్రా సౌకర్యాలను పర్యవేక్షించడానికి సిబ్బంది గణనీయమైన సమయాన్ని వెచ్చించాలి.. ప్రతి జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించడానికి వేలాది మంది ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు.. ఉపాధ్యాయులకు ఇది సెలవు సమయం, దేవాదాయ శాఖ సిబ్బందికి ఇది చాలా బిజీ, పీక్ టైమ్.. దేవాదాయ శాఖ కమిషనర్ కూడా ఈ మేరకు వినతిపత్రం ఇచ్చామని ఆమె చెప్పుకొచ్చారు. దేవాదాయ సిబ్బంది సేవల వినియోగం నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతున్నామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనాను పురంధేశ్వరి కోరారు.