Leading News Portal in Telugu

BJP Manifesto: రేపు బీజేపీ మేనిఫెస్టో విడుదల.. అందరిలో ఆసక్తి..



Bjp

BJP Manifesto: లోక్‌సభ ఎన్నికల కోసం రేపు బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేయబోతోంది. సంక్షేమం, అభివృద్ధి ప్రణాళికతో పాటు ‘విక్షిత్ భారత్’ రోడ్‌మ్యాప్ ఎన్నికల ఎజెండాలో ప్రముఖంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఆదివారం అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం ఉంటుందని, దీనికి ప్రధాని నరేంద్రమోడీ కూడా హాజరవుతారని తెలుస్తోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దుతో సహా పలు సైద్ధాంతిక వాగ్దానాలను నెరవేర్చిన బీజేపీ, తన తాజా మేనిఫెస్టోలో ఏ అంశాలను ప్రకటిస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. యువత, మహిళలు, రైతులు, పేదలు అనేవి నాలుగు కులానే అని పలు సందర్భాల్లో ప్రస్తావించిన ప్రధాని మోడీ, ఈ మానిఫెస్టోలో వారి కోసం హమీలను ఇస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ ఈ మేనిఫెస్టోను రూపొందించింది.

Read Also: Bournvita: బోర్న్‌విటాలో చక్కెర చేదును మిగిల్చిందా..? “హెల్త్ డ్రింక్” ట్యాగ్ ఎందుకు కోల్పోయింది..?

ఇప్పటికే కాంగ్రెస్ న్యాయ్ సూత్రాల పేరుతో 25 హామీలను ప్రకటించింది. ఇందులో రైతులకు మద్దతు ధర, యువతకు ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ, మహిళలకు ఆర్థిక సాయం వంటి హామీలను ఇచ్చింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని అనుకుంటుంటే, ఈసారి మోడీని ఎలాగైనా గద్దె దించుతామని ఇండియా కూటమి చెబుతోంది.