Leading News Portal in Telugu

Ram Charan: గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్



Ram Charan Receives Honorary Degree From Vels University

Ram Charan receives honorary degree From Vels University: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కి చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. శనివారం రామ్ చరణ్‌ అభిమానుల సోషల్ మీడియా పేజీలలో గ్రాడ్యుయేషన్ వేడుకలో నటుడు గౌరవ డిగ్రీని అందుకున్న కొత్త ఫొటోలను షేర్ చేశారు. ఇక ఈ వేడుకకి ఆయన ముఖ్య అతిథిగా కూడా అధ్యక్షత వహించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త వీడియోలో, రామ్ చరణ్ వేదికపై చీఫ్ గెస్ట్ మరియు విశ్వవిద్యాలయంలోని ఇతర గౌరవ సిబ్బంది నుండి గౌరవాన్ని అందుకోవడం కనిపించింది. రామ్ చరణ్ రెడ్ గ్రాడ్యుయేషన్ గౌనులో కనిపిస్తున్నారు. ఇక వేల్స్ విశ్వవిద్యాలయం యొక్క అధికారిక X ఖాతా కూడా చరణ్ తో ఒక గ్రూప్ ఫోటోను పంచుకుంది. రామ్ చరణ్ 14వ వేల్స్ విశ్వవిద్యాలయం వార్షిక కాన్వకేషన్‌లో గౌరవ డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీని అందుకున్నారు.

Venu Swamy : భార్యతో వేణుస్వామి మరో రీల్.. బాగా భయపడ్డాడే..

రామ్ చరణ్ 2007లో చిరుత సినిమాతో తెరంగేట్రం చేశారు. అప్పటి నుండి, తన కెరీర్‌లో మగధీర, ఎవడు మరియు ధృవ వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. SS రాజమౌళి దర్శకత్వం వహించిన RRR ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. నాటు నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌ను గెలుచుకుంది. ఇక రామ్ చరణ్ పనితనానికి నంది అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సహా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులను అందుకున్నారు. ఇక ఇప్పుడు డాక్టరేట్ అందుకున్నారు. వేల్స్ విశ్వవిద్యాలయం వివిధ రంగాలలో విశిష్ట వ్యక్తులను గుర్తిస్తూ గౌరవిస్తూ వస్తోంది. అందులో రామ్ చరణ్ వినోద పరిశ్రమలో చేసిన కృషికి గౌరవాన్ని అందుకుంది. ఇక రామ్ చరణ్ చంద్రయాన్, ఇస్రో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ పి వీరముత్తువేల్‌తో కలిసి వేడుకలో పాల్గొన్నారు.