Leading News Portal in Telugu

Devyani Khobrogade​: కంబోడియా న్యూ ఇయర్ వేడుకలు.. ‘అప్సర’గా కనిపించిన భారత రాయబారి



Devyani Khobrogade

Devyani Khobrogade​: కంబోడియాలో ఖైమర్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అలాంటి వేళ కంబోడియాలోని భారత రాయబారి దేవయాని ఖోబ్రగాడే.. అప్పరగా దిగిన ఫోటోలను రాయబారి కార్యాలయం ఎక్స్‌(ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. కంబోడియాలోని భారత రాయబారి దేవయాని ఖోబ్రగాడే కంబోడియా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ‘ఖైమర్ అప్సర’ సంప్రదాయ దుస్తులను ధరించారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి ఖోబ్రోగాడే ‘ఖైమర్ అప్సర’ దుస్తులలో ఫోటోషూట్ చేశారు. 2013లో భారత్-అమెరికా మధ్య తలెత్తిన ఉద్రిక్తతకు దేవయాని ఖోబ్రగాడే కారణమని తెలిసిందే.

రాయబారి దేవయాని ఖోబ్రగాడే ఖైమర్ సంస్కృతి, సంప్రదాయాన్ని ఇష్టపడతారు. అందులోభాగంగానే కేమర్ అప్సర దుస్తులు ధరించారని చెప్పింది. ఇక్కడి నాగరికతతో ఆమెకు బంధం బలపడిందంది. కంబోడియా స్నేహితులకు ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ నూతన సంవత్సర వేడుకలు కంబోడియా ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కంబోడియా సంప్రదాయనికి తగ్గట్లు ఆమె దస్తులు ధరించారు. దేవయాని ఫోటోల్లో బంగారు అభరణాలతోపాటు.. తలకు కిరిటాన్ని సైతం ధరించారు.

Read Also: Afghanistan Floods: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాలు.. వరదల్లో 33 మంది మృతి

కంబోడియాలో ప్రతి ఏడాది మూడు రోజులు పాటు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతాయి. వాటిని ఖైమర్ నూతన సంవత్సర వేడుకలని పిలుస్తారు. దీనిని చౌల్ చనమ్ తీమే అని పిలుస్తారు. అంటే నూతన సంవత్సరం ప్రవేశిస్తుందని అర్థం. కంబోడియాలో పంట సాగు కాలం పూరి అయిన తర్వాత వర్షకాలం ప్రవేశిస్తున్న వేళ.. ఈ వేడుకలను జరుపుకుంటారు.

1999 ఇండియా ఫారెన్ సర్వీస్ అధికారి దేవయాని ఖోబ్రగాడే. గతంలో బెర్లిన్, ఇస్తామాబాద్, రోమ్, న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయాల్లో విధులు నిర్వహించారు. న్యూఢిల్లీలోని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పలు కీలక విభాగాల్లో సైతం ఆమె ఉన్నతాధికారగా పని చేశారు. ప్రస్తుతం దేవయాని కంబోడియాలో భారత రాయబారిగా ఉన్నారు. దేవయాని ఖోబ్రగాడే 2020లో కంబోడియాలో భారత రాయబారిగా నియమితులయ్యారు.