
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం విచారణలో భాగంగా కవితకు రూస్ అవెన్యూ కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే.. కోర్టులో కవితను హాజరు పరిచిన సిబిఐ అధికారులు.. కవితని జ్యూడిషియల్ కస్టడీకి పంపాలని కోరింది. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామని, ఆమె విచారణకు సహకరించలేదని తెలిపింది. సీబీఐ వాదనలు విన్న కోర్టు.. కవితను 23 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. కాగా.. కవిత మాట్లాడుతూ.. ఇది బీజేపీ కస్టడీ.. సీబీఐ కస్టడీ కాదన్నారు. బయట బీజేపీ వాళ్ళు అడిగింది లోపల సీబీఐ అడుగుతుందన్నారు. రెండు నెలల నుంచి అడుగుతున్నారు. అడిగింది అడుగుతున్నారు కొత్తది ఏమీ లేదన్నారు.
Read also: Keerthi Suresh : ట్రేడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడు రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు ఆమెను సోమవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కవితను సీబీఐ న్యాయమూర్తి కావేరీ బవేజా ఎదుట హాజరుపరిచారు. ఇక, ఆదివారం విచారణలో భాగంగా ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్ ద్వారా సేకరించిన చాటింగ్లు, మహబూబ్నగర్లో భూముల వ్యవహారం, ఆప్ నేతలకు ప్రాక్సీ ద్వారా డబ్బుల చెల్లింపులు, ఈ క్రమంలో బెదిరింపులపై కవితను ప్రశ్నించినట్లు తెలిసింది.
Read also: Devyani Khobrogade: కంబోడియా న్యూ ఇయర్ వేడుకలు.. ‘అప్సర’గా కనిపించిన భారత రాయబారి
సీబీఐ కార్యాలయంలో ఉన్న కవితను ఆమె భర్త అనిల్, సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టులో అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది, అయితే ప్రత్యేక కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్పై ఈ నెల 16న విచారణ జరగనుంది. ఇటీవల సీబీఐ కూడా కవితను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Afghanistan Floods: ఆఫ్ఘనిస్తాన్లో భారీ వర్షాలు.. వరదల్లో 33 మంది మృతి