Leading News Portal in Telugu

CM Jagan : సీఎం జగన్‌పై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం



Jagan

ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయవాడ నగరంలో ‘మేమంతా సిద్ధం’ రోడ్‌షో నిర్వహిస్తుండగా శనివారం రాత్రి సింగ్‌నగర్‌ డాబా కొట్ల రోడ్డులో రాయి తగిలి సీఎం నుదుటిపై గాయమైన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన ప్రాంతంలో అనుమానితుల కదలికలపై స్థానికుల నుంచి స్టేట్ మెంట్లు రికార్డ్ చేసిన పోలీసులు.. గత వారం రోజులుగా పదే పదే స్థానికంగా తిరిగిన వారి వివరాలు సేకరిస్తున్నారు. ఘటన జరిగిన స్థలంలో ఉన్న సెల్ టవర్స్ నుంచి దాడి తర్వాత ఎక్కువ సార్లు మాట్లాడిన ఫోన్ కాల్స్ పై టెక్నికల్ టీమ్ ఫోకస్ చేసింది. వివేకానంద స్కూల్ ప్రాంగణం నుంచే దాడి జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. రౌడీ షీటర్లతో పాటు, గంజాయి, చెడు వ్యసనాలు తిరిగి ఆవారా బ్యాచ్ లను పోలీసు బృందాలు విచారిస్తున్నాయి. 24 సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించి అనుమానితులను గుర్తించే పనిలో ఉంది క్లూస్ టీమ్. బస్సు కి 20 నుంచి 30. అడుగుల దూరం నుంచే దాడి జరిగినట్టు గుర్తించిన పోలీసులు.. ఈ తరహా దాడులకు పాల్పడే పాత నేరస్తులను విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం పశ్చిమ డీసీపీ హరికృష్ణ నేతృత్వంలో 20 మందితో కూడిన ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఇందులో ఆరు బృందాలు పనిచేస్తున్నాయి. లా అండ్‌ ఆర్డర్‌, సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సభ్యులుగా ఉన్న ఈ బృందాలు ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించాయి.