Leading News Portal in Telugu

Komatireddy: మంత్రి కోమటిరెడ్డికి ఆట సభలకు ఆహ్వానం



Kommati Reddyt

అమెరికాలో అత్యంత ప్రతిష్టత్మకంగా నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వివార్షిక మహాసభలకు.. తెలంగాణ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి‌కి ఆహ్వానం అందింది. అమెరికాలోని అట్లాంటలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్‌లో నిర్వహించే ఆట కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ లో ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా ఆట ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ మేరకు ఆట కన్వినర్ పాశం కిరణ్ రెడ్డి ఆహ్వాన లేఖను మంత్రికి అందించారు.

ఇది కూడా చదవండి: Minister Ambati: పోలవరం విషయంలో చంద్రబాబు చేసిన తప్పు ఇదే..?

జూన్ 7 నుంచి 9 వరకు మూడు రోజులపాటు అట్లాంట నగరంలో నిర్వహించే ఈ ఆట వేడుకల్లో అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే చిన్నారుల సంస్కృతిక కార్యక్రమాలతో పాటు యువత కోసం జాబ్ ఫెయిర్స్, ఎడ్యూకేషన్ సమ్మిట్స్, హెల్త్ క్యాంపస్‌తో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌ల ఏర్పాటు, సానిటేషన్ వంటి మౌళిక వసతులు కల్పించేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన మంత్రికి వివరించారు. విశాలమైన అమెరికా దేశంలో ఆట వేదికగా తెలుగు భాష మాట్లాడేవారందరిని ఒక్కటిగా కలిపి ఉంచడంతో పాటు.. తెలుగు భాషను, సంస్కృతిని పెంపొందిస్తున్నామని మంత్రికి లేఖలో వివరించారు.

ఇది కూడా చదవండి: Snake Bite: రైలులో ప్రయాణికుడిని కాటేసిన పాము..

తెలంగాణలో రోడ్లు, భవనాల నిర్మాణంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రంలో మౌళిక వసతుల కల్పనలో అవిశ్రాంతంగా శ్రమించడంతో పాటుగా.. సినిమా పరిశ్రమ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న మీరు కుటుంబ సమేతంగా ఆట సమావేశాలకు వస్తే.. అది తెలుగువారందరికి మంచి సందేశం ఇస్తుందని మంత్రికి ఆట ప్రతినిధులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Salman Khan: కాల్పుల అనంతరం మొదటిసారి బయటకొచ్చిన సల్మాన్ ఖాన్