Leading News Portal in Telugu

Boyapati Sreenu: అఖండ సీక్వెల్‌పై బోయపాటి కీలక అప్డేట్



Balakrishna Boyapati Srinu

Boyapati Sreenu confirms Akhanda sequel: బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు మూడు సినిమాలు చేస్తే దాదాపు మూడు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇద్దరు కలిసి ముందుగా సింహా తర్వాత లెజెండ్ సినిమాలతో పాటు చివరిగా అఖండ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ అఖండ సినిమా అయితే బాలకృష్ణ కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా మారింది. ఇక ఈ సినిమా చివరిలో రెండో భాగానికి లీడ్ వదిలారు. అయితే ఎప్పుడు ఈ రెండో భాగం తెరకెక్కుతుందని విషయం మీద క్లారిటీ లేదు. కానీ ఈ విషయం మీద తాజాగా బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు. తాజాగా కోకాపేట సమీపంలో సురేష్ బాబు నిర్మించిన ఒక ఆలయ పూజా కార్యక్రమంలో ఆయన మీడియాతో ముచ్చటించారు.

Nani 33: నాని సినిమాలో నటించాలని ఉందా.. మీకే ఈ బంపరాఫర్!

ఈ సందర్భంగానే తన అఖండ సీక్రెట్ గురించి ఆయన లీక్ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణతో అఖండ సినిమా ఉంటుందని చెబుతూనే ఇప్పట్లో అయితే సినిమా ఉండదని ప్రస్తుతం తమకి ఉన్న కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత అధికారికంగా సినిమా అనౌన్స్ చేసి స్టేట్స్ మీదకు వెళతామని చెప్పుకొచ్చారు. సొసైటీకి కావాల్సిందేమిటో బాలకృష్ణ అభిమానులకు కావాల్సిందేమిటో తనకి తెలుసు అని వారందరూ ఆనందించేలా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు బోయపాటి శ్రీను. ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల మీద ఈ సినిమాని గ్రాండ్గా నిర్మిస్తున్నారు. ఇక బోయపాటి విషయానికి వస్తే అల్లు అర్జున్ తో సినిమా అని ఒకసారి సూర్యతో సినిమా చేస్తున్నాడు అని ఒకసారి రకరకాల పేర్లు వస్తున్నాయి. కానీ అధికారికంగా ప్రకటిస్తే తప్పు బోయపాటి శ్రీను సినిమా ఎవరితో ఉంటుందనే విషయం మీద క్లారిటీ లేదు.