Leading News Portal in Telugu

Nabha Natesh: హీరోయిన్‌ను డార్లింగన్న ప్రియదర్శి.. మాటలు జాగ్రత్త అంటూ నభా వార్నింగ్!



Priyadarshi

Nabha Natesh Warns Priyadarshi News: ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో భాగమైన నభా నటేష్ ఆ తర్వాత ఎందుకో కొంత సినిమాలకు గ్యాప్ తీసుకుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ యాక్టివ్ అవుతున్న ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతుంది. 20 సెకండ్ల నిడివి ఉన్న వీడియోలో ఆమె ప్రభాస్ డార్లింగ్ అనే పదం పిలుస్తుండగా దానికి డబ్స్మాష్ లాంటి వీడియో చేసింది. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అటు ప్రభాస్ అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం ఆమె పెట్టిన వీడియో మీద ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. దానికి హీరో ప్రియదర్శి స్పందిస్తూ వావ్ సూపర్ డార్లింగ్, కిరాక్ ఉన్నావు డార్లింగ్ అని కామెంట్ పెట్టాడు.

Chiyaan Vikram 62: ‘వీర ధీర శూరన్’ అంటూ వచ్చేస్తున్న విక్రమ్

దీంతో ప్రియదర్శి మీద ఆమె ఫైర్ అవుతున్నట్లు, మిస్టర్ మాట్లాడే ముందు జాగ్రత్త అని అంటూ ఒక తెలియని అమ్మాయిని డార్లింగ్ అని పిలవడం కూడా ఐపిసి సెక్షన్ 354 A ప్రకారం సెక్సువల్ హెరాస్మెంట్ కిందకు వస్తుంది అనే ఫోటోని షేర్ చేసింది. దానికి ప్రియదర్శి కూడా అంతే తెలివిగా సమాధానం ఇచ్చాడు. మనం ఒకరికొకరం తెలియదని నాకు తెలియదు, బై ద వే మీరు డార్లింగ్ అనొచ్చు మేము అంటే ఐపిసి సెక్షన్ 354 ఏ ప్రకారం కేసులు పెడతారా? అని ప్రశ్నిస్తూనే మళ్లీ లైట్ తీసుకో డార్లింగ్ అంటూ కామెంట్ చేశారు.