
PM Modi: లోక్‌సభ తొలి విడత ఎన్నిల ఏప్రిల్ 19న జరగబోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తొలి దశలో పోటీ చేస్తున్న బీజేపీ, ఎన్డీయే అభ్యర్థులకు వ్యక్తిగతంగా లేఖ రాశారు. ప్రధానమంత్రి సందేశం నియోజకవర్గంలోని ప్రతీ ఒక్కరికీ చేరేలా బీజేపీ కసరత్తులో ఈ లేఖ భాగంగా కనిపిస్తోంది. కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తు్న్న తమిళనాడు చీఫ్ అన్నామలైకి లేఖ రాశారు. ఆయనతో పాటు పలు రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రాంతీయ భాషల్లోనూ ప్రధాని లేఖ రాశారు. ఈ లేఖ రావడంతో అభ్యర్థులు ఆశ్చర్యపోతున్నారు. ఈ లేఖ తమ నియోజకవర్గంలో ప్రతీ ఓటరికి చేరేలా చూస్తామని చెప్పారు.
అన్నామలైకి రాసిన లేఖలో ‘‘ ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాన్ని వదిలి నేరుగా ప్రజలకు సేవ చేయడానికి మీరు నిర్ణయించుకున్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. తమిళనాడు అంతటా బీజేపీని పటిష్టం చేయడంతో, చట్టాన్ని అమలు చేయడం, యువత సాధికారత వంటి క్లిష్ట సమస్యలపై పోరాడటంలో మీ నిబద్ధతతో కూడిన నాయకత్వానికి అందించారు. కోయంబత్తూర్ మొత్తం మీ నుంచి లాభం పొందుతుంది. ప్రజల ఆశీర్వాదంతో మీరు పార్లమెంట్‌కి చేరుకుంటారన్న నమ్మకం నాకుండి. మీలాంటి టీమ్ సభ్యులు నాకు గొప్ప ఆస్తి, ఒక టీమ్‌గా నియోజకవర్గం ప్రజల సంక్షేమానికి, దేశ ప్రజల సంక్షేమానికి ఎలాంటి తిరుగు లేకుండా చేస్తాం’’ అని ప్రధాని చెప్పారు.
Read Also: Earthquake: జపాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదు
‘‘ ఈ లేఖ ద్వారా ఇవి సాధారణ ఎన్నికలు కావని మీ నియోజకవర్గ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. భారత దేశంలోని కుటుంబాలు కాంగ్రెస్ పాలనలో 5-6 దశాబ్ధాల పడ్డ కష్టాలను గుర్తుంచుకుంటాయి. గత 10 ఏళ్లలో సమాజంలోని ప్రతి వర్గాల జీవన నాణ్యత మెరుగుపడింది, ఈ సమస్యలు చాలా వరకు తొలగించబడ్డాయి మరియు మెరుగైన జీవితాన్ని నిర్ధారించే మా మిషన్‌లో ఈ ఎన్నికలు నిర్ణయాత్మకమైనవి’’ అని లేఖలో మోడీ పేర్కొన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికలు శుక్రవారం(ఏప్రిల్ 19) న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. ఏడు దశల్లో దేశంలోని 543 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తుది ఫలితాలు జూన్ 4న ప్రకటించబడుతాయి. భారత తొలి ఎన్నికలు అక్టోబర్ 25, 1951 నుంచి ఫిబ్రవరి 1952 వరకు నాలుగు నెలల పాటు సాగాయి. ఆ తర్వాత ఇవే అత్యంత సుదీర్ఘమైన ఎన్నికలు. ఏప్రిల్ 19న తొలి విడతలో దేశవ్యాప్తంగా 102 నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.