Leading News Portal in Telugu

Pushpa 2 : భారీ ధరకు పుష్ప 2 నార్త్ ఇండియా రైట్స్..



Whatsapp Image 2024 04 18 At 7.19.55 Am

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.2021 లో వచ్చిన ‘పుష్ప1: ది రైజ్’ భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం హిందీ ప్రేక్షకులను కట్టిపడేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధించింది.. అల్లు అర్జున్ స్టైల్, మేనరిజమ్, సినిమాకే హైలైట్ గా నిలిచాయి. దీంతో పుష్ప మూవీకి సీక్వెల్ గా వస్తున్న ‘పుష్ప 2’ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది . ఈ నేపథ్యంలో పుష్ప 2 మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయని సమాచారం.

పుష్ప 2: ది రూల్ మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తందానీకి చెందిన ఏఏ ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ రైట్స్ కోసం ఏకంగా రూ.200 కోట్లను అనిల్ తందానీ చెల్లించారని సమాచారం.ఏకంగా రూ.200 కోట్లకు పుష్ప 2 థియేట్రికల్ రైట్స్ అమ్ముడవడంతో ఈ మూవీ కోసం అక్కడి ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధం అవుతుంది . పుష్ప 2 చిత్రంతో నార్త్ ఇండియా థియేట్రికల్ ప్రీ-రిలీజ్ బిజినెస్‍లో అల్లు అర్జున్ సరి కొత్త రికార్డును క్రియేట్ చేశారు. బాలీవుడ్ మూవీస్ కి మించి పుష్ప 2 మూవీ భారీగా బిజినెస్ చేసింది .పుష్ప 2 మూవీ విడుదల అయ్యాక ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం పుష్ప 2 కలెక్షన్స్ జాతర సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది .పుష్ప 2 సినిమా ఈ ఏడాది ఆగస్టు 15 ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది .మరి విడుదల అయ్యాక పుష్ప 2  మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి..