Leading News Portal in Telugu

Iran Ship: ఇరాన్ నుంచి స్వదేశానికి వచ్చిన భారతీయ మహిళ.. అసలేం జరిగిందంటే..!



Ke

పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ఇప్పటికే గాజా-ఇజ్రాయెల్ యుద్ధంతో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఇరాన్ కాలు దువ్వింది. ఇప్పటికే ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులకు తెగబడింది. ఇక ఇజ్రాయెల్‌ కూడా ప్రతీకార దాడులకు రెడీ అవుతోంది. ఇంతటి భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇరాన్ స్వాధీనం చేసుకున్న కార్గో షిప్‌లోని 17 మంది భారతీయులలో కేరళకు చెందిన ఒక మహిళ స్వదేశానికి తిరిగి క్షేమంగా చేరుకుంది. త్రిసూర్‌కు చెందిన ఆన్ టెస్సా జోసెఫ్ కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇతర సిబ్బంది కూడా ఆరోగ్యంగా ఉన్నారని.. భారతదేశంలోని వారి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారని ఎంఈఏ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Priyadarshi: మరో హీరోయిన్‌ను డార్లింగన్న ప్రియదర్శి.. నీ మైండ్‌కేమైందంటూ ఆడుకున్న నభా!

ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ భారత్‌కు వచ్చే ఓ నౌకను ఇరాన్‌ స్వాధీనం చేసుకుంది. పర్షియన్‌ గల్ఫ్‌లో నియంత్రణలోకి తీసుకున్న ఈ నౌకలో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. వారిలో ఒకరైన కేరళ యువతిని ఇరాన్‌ విడిచిపెట్టింది. దీంతో ఆమె గురువారం క్షేమంగా స్వదేశానికి తిరిగొచ్చేసింది. నౌక స్వాధీనం వ్యవహారంపై ఇరాన్‌ ప్రభుత్వంతో అక్కడి భారతీయ దౌత్య కార్యాలయం నిరంతరం సంప్రదింపులు జరిపింది. దీంతో సిబ్బందిలో ఒకరైన జోసెఫ్‌ను విడుదల చేశారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. మిగతా 16 మందితో ఎంబసీ అధికారులు టచ్‌లోనే ఉన్నారని తెలిపారు. వారు ఆరోగ్యంగానే ఉన్నారని, భారత్‌లోని కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నారని చెప్పారు. మిగతా సిబ్బంది విడుదల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Nirbhay cruise missile: చైనా-పాకిస్తాన్‌కి వణుకే.. నిర్భయ్ క్షిపణి విజయవంతం..