
రాజకీయాలు అనేది ఒక హాబీ అని హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అని మాధవి లత అన్నారు. రాజకీయాలు మాత్రమే అవినీతి లేదు.. అంతటా ఉంది అన్నారు. ప్రజల కోసం నేను కిల్ అయినా అవుతాను.. లేదంటే జాయింట్ కిల్లర్ ను అవుతానన్నారు. ఒక వర్గం కోసమే నేను ఎంపీగా పోటీ చేయడం లేదన్నారు. ఎంఐఎం నేతలు స్వార్థపూరితమైన ఆలోచనతో పాతబస్తీలోని ప్రజలు మగ్గిపోతున్నారని ఆమె తెలిపారు. నేను సేవ చేసేది ముస్లీం మహిళల కోసం.. ఎందుకంటే పాతబస్తీలో ఎంఐఎం చేసిన మంచి పనులేంటి అని ప్రశ్నించారు. అక్కడ, ఎంఐఎం మతం పేరుతో చిన్న పిల్లలు రెచ్చగొడుతుందని చెప్పారు.. నేను మోడీ చేసిన ప్రతి కార్యక్రమం ప్రతిసారి మాట్లాడుతున్నాను అన్నారు. హిందుత్వం అనే పదం సనాతనం.. సెక్యులర్ అనే పదం సనాతనం కాదు అని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత ఎన్డీవీ క్వశ్చన్ అవర్ లో వెల్లడించారు.
Read Also: Perni Nani: నాపై విషం చిమ్ముతున్నారు.. పచ్చి అబద్ధాలు చెబుతున్నారు..
భారతదేశంలో కులాలు లేవు.. వృత్తులు మాత్రమే ఉన్నాయి.. బ్రిటిష్ కాలం నుంచే కులం ఏర్పడింది అని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత తెలిపారు. హిందుత్వాన్ని వ్యతిరేకించే వాళ్లతో నాకేం పని.. వాళ్లు భారత్ మాతాకీ జై అనడానికి కూడా ఇష్టపడనప్పుడు.. అలాంటి వారి గురించి మాట్లాడటం వెస్ట్ అని పేర్కొన్నారు. భాగ్యలక్ష్మీ టెంపుల్ కి వెళ్లేంది రాజకీయాల కోసం కాదు.. కేవలం అమ్మవారి ఆశీర్వాదం కోసమేన్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చడానికి నేను సపోర్ట్ ఇస్తాను.. పేరు మార్పిడికి అభివృద్ధికి సంబంధం లేదన్నారు. హైదరాబాద్ కు భాగమతి పేరు ఎందుకు పెట్టకూడదు అంటూ ప్రశ్నించారు. ఇక, నేను ఎంపీగా విజయం సాధించేందుకు ఎమ్మెల్యే రాజాసింగ్ నాకు సంపూర్ణ మద్దతు ఇస్తారని భావిస్తాను అని హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత పేర్కొన్నారు.
Read Also: Swami Paripoornananda: ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు నామినేషన్.. అలా అయితేనే ఉపసంహరణపై ఆలోచన..!
నేను ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కూడా ఓటు వేయ్యండి అని అడగలేదు అని మాధవీలత చెప్పారు. ఓటు అనేది వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయం.. నేనేమీ చెప్పకముందే జనం తమ గోడు చెప్పుకుంటున్నారు.. జనం బాధలు విన్న తర్వాత నాకు నోట మాట పడిపోతుందన్నారు. పాత బస్తీలో రెండు భయంకరమైన కర్య్ఫూలు చేశాను అని ఆమె చెప్పుకొచ్చారు. ఓల్డ్ సిటీలో నేను ఎన్నో ఇస్లామిక్ ఎన్జీవోలతో పని చేశాను.. కేవలం సమాజ సేవతోనే పాతబస్తీ బాగుపడని వెల్లడించారు. 45 ఏళ్లుగా పాతబస్తీలో మార్పు అనేదానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. అయితే, అసద్ ఎవరిని చూసి భయపడుతున్నాడో ఆయనకే తెలియాలి.. నేను మాత్రం ఎవరికి భయపడను.. అంత బేలగా మాట్లాడను.. గత 30 ఏళ్లుగా నేను ఇదే కట్టుబొట్టుతో ఉన్నానని తెలిపారు. ఇక, ఎంపీగా గెలవకపోతే నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.. వక్స్ బోర్డు భూముల గురించి కొట్లాడాల్సింది చాలా ఉంది.. గత ఏళ్లుగా నేను చేస్తున్నా ధర్మ కార్యక్రమాలే నాకు ఎంపీ టికెట్ వచ్చేలా చేసిందని ఎంపీ అభ్యర్థి మాధవీలత అన్నారు.
Read Also: IPL tickets: అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఏఐవైఎఫ్ డిమాండ్
ఇక, ఏపీ, తమళనాడులో కూడా సేవా కార్యక్రమాలు చేశాను అని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత తెలిపారు. పాతబస్తీకి కేంద్రం నుంచి నిధులు వస్తాయి.. కానీ వాటిని వాడుకోవడంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి.. 40 ఏళ్లుగా ఎంఐఎం మీద ఎవరూ విజయం సాధించలేరు.. కాబట్టి నేను కూడా గెలుస్తానో లేదో అనే అనుమానం అందరికి రావడం సహజం.. నేను రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు కూడా వేయలేదన్నారు. నేను భారత భాగ్య సమృద్ది యాగం దేశం కోసమే చేశాను అని ఎంపీ అభ్యర్థి మాధవీలత పేర్కొన్నారు.