
AP Government: ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారంటూ వెంకటరామిరెడ్డిపై అభియోగాలు మోపారు.. బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమై.. వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారంటూ వెంకటరామిరెడ్డిపై ఫిర్యాదులు వెళ్లాయి.. దీంతో, చర్యలకు దిగింది ప్రభుత్వం.. వెంకటరామిరెడ్డిని సస్పెండ్ చేసిన సర్కార్.. హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటరామిరెడ్డిపై చర్యలు తీసుకుంది.. అయితే, ప్రస్తుతం పంచాయితీ రాజ్ శాఖలో ఇన్ఛార్జ్ అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్నారు వెంకట రామిరెడ్డి.. ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్.
Read Also: Pramod Sawant: హామీలు నెరవేర్చని కాంగ్రెస్ను ఇంటికి పంపించాలి