Leading News Portal in Telugu

YV Subba Reddy : ఉత్తరాంధ్రలో 30స్థానాలకు పైగా గెలుస్తున్నాం.. రెండు రోజుల్లో మేనిఫెస్టో



Yv Subba Reddy

ప్రజా స్పందన చూస్తుంటే 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో విజయం వైసీపీదే అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఉత్తరాంధ్రలో 30స్థానాలకు పైగా గెలుస్తున్నామన్నారు. రెండు రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేస్తామని, ఉత్తరాంధ్ర అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి తో రూపొందించామన్నారు. విజన్ డాక్యుమెంట్ ద్వారా ఇప్పటికే ముఖ్యమంత్రి ఈ ప్రాంతం అభివృద్ధిపై ప్రభుత్వ విధానం ప్రకటించారన్నారు. నామినేషన్ల ప్రక్రియ ను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన ప్రతి ఒక్కరీ గుండెల్లో జగన్‌ ఉన్నంత కాలం వైఎస్సార్‌సీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు.

 
Etela Rajender: కిషన్ రెడ్డికి మనుషులు మాత్రమే తెలుసు.. మతం, కులం రంగు లేదు..
 

నర్సీపట్నం నియోజకవర్గంలో రూ.1,700 కోట్లతో సంక్షేమ, అభివృద్ధి పనులు చేశామన్నారు. మరలా ఎమ్మెల్యేగా పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ గెలిపిస్తే మరింత అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా అతిసామాన్య వ్యక్తి బూడి ముత్యాలనాయుడు కాగా, కూటమి నుంచి ఇతర జిల్లా నుంచి సంపన్న వ్యక్తిని దిగుమతి చేసుకున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల పెత్తందారులకు, పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు.

 T20 World Cup 2024: ఆ ఆటేంది.. కొంచెం యశస్వి జైస్వాల్‌తో మాట్లాడండి!