Neha Murder Case: కాంగ్రెస్ కార్పొరేటర్ కుటుంబానికి జేపీ నడ్డా పరామర్శ.. నేహ హత్యపై సీబీఐ విచారణకు డిమాండ్..

Neha Murder Case: కర్ణాటకలో రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది ఎంసీఏ విద్యార్థి నేహా హిరేమత్(23) హత్య కేసు. ఈ హత్య బీజేపీ, అధికార కాంగ్రెస్ మధ్య విమర్శలకు దారి తీసింది. హుబ్బళ్లిలో కాలేజ్ క్యాంపస్‌లో నేహాని ఫయాజ్ అనే సహవిద్యార్థి కత్తితో పొడిచి చంపేశాడు. అయితే, ఈ ఘటనలో ‘లవ్ జిహాద్’ కోణం ఉందని బీజేపీ ఆరోపిస్తుండగా.. కాంగ్రెస్ అలాంటిదేం లేదని ఇది వ్యక్తిగత విషయమని చెబుతోంది. ఇదిలా ఉంటే తన కూతురును ట్రాప్ చేయడానికి గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారని, అందుకు లొంగకపోవడంతో హత్య చేశారని కాంగ్రెస్ కార్పొరేటర్, నేహ తండ్రి నిరంజన్ హిరేమత్ ఆరోపించారు.
Read Also: CM Revanth Reddy: రాజ్యాంగం రక్షించాలంటే..రాహుల్ ప్రధాని కావాలి..
ఇదిలా ఉంటే తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రోజు నేహా కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాధితురాలకి న్యాయం జరిగేలా కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అందుకు బీజేపీ సహకరిస్తుందని అన్నారు. దు:ఖ సమయంలో వారి కుటుంబానికి అండగా ఉండటానికి వచ్చానని, ఈ హృదయవిదారక ఘటనను నేహ తల్లిదండ్రులు వివరించారని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసులు నిర్వహించలేకపోతే, కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నట్లు నడ్డా చెప్పారు. రాష్ట్రప్రభుత్వం కోరుకుంటే కేసును సీబీఐకి సిఫారసు చేయవచ్చు, అమాయక బాలికకు న్యాయం జరిగేలా, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం జరగకుండా బీజేపీ సహకరిస్తుందని, నేహా తండ్రి కూడా రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, ఆయన కూడా కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతున్నట్లు నడ్డా తెలిపారు.
ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರದ ಓಲೈಕೆಯ ರಾಜಕಾರಣಕ್ಕೆ ಬಲಿಯಾದ ಹುಬ್ಬಳ್ಳಿಯ ವಿದ್ಯಾರ್ಥಿನಿ ನೇಹಾ ಹಿರೇಮಠ್ ಅವರ ಮನೆಗೆ ಬಿಜೆಪಿ ರಾಷ್ಟ್ರೀಯ ಅಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀ @JPNadda ಅವರು ಭೇಟಿ ನೀಡಿ ಕುಟುಂಬಸ್ಥರಿಗೆ ಧೈರ್ಯ ತುಂಬಿ, ಸಾಂತ್ವನ ಹೇಳಿದರು.
ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಲೋಕಸಭಾ ಚುನಾವಣಾ ರಾಜ್ಯ ಉಸ್ತುವಾರಿಗಳಾದ @AgrawalRMD, ಕೇಂದ್ರ ಸಚಿವರಾದ ಶ್ರೀ… pic.twitter.com/6y5zqMx03i
— BJP Karnataka (@BJP4Karnataka) April 21, 2024