
TS BJP Leaders Nominations: తెలంగాణ రాష్ట్రంలో నేటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు బీజేపీ నుంచి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నేడు నిజామాబాద్, కరీంనగర్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి స్థానాలకు బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ధర్మపురి అరవింద్ నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్గొంటారు.
Read also: Bihar : బీహార్‌లో జేడీయూ నేత దారుణ హత్య.. మరో యువకుడికి గాయాలు
ఇక.. బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు.. నాగర్ కర్నూల్ పార్లమెంట్ కు పోతుగంటి భరత్ నామినేషన్ వేయనున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. టవర్ సర్కిల్ వద్ద సీఎం భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రసంగించనున్నారు. అనంతరం బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు జరగనున్నాయి. మరోవైపు.. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిపై ఉత్కంఠ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా గోమా శ్రీనివాస్‌ను ప్రకటించింది. ఇవాళ శ్రీనివాస్ కే పెద్దపల్లి ఇస్తున్నట్లు ప్రకటించింది.
Suryapet Road Accident: ఆగివున్న లారీని ఢీ కొట్టిన కారు.. ఆరుగురు స్పాట్ డెడ్