Leading News Portal in Telugu

Kadiyam Srihari : హరీష్ రావు డ్రామా రావుగా మారారు



Kadiyam Srihari

హరీష్ రావు డ్రామా రావుగా మారారని కడియం శ్రీహరి విమర్శించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. మొదట సవాల్ చేసింది హరీష్ రావే ఆ సవాలను స్వీకరించింది సీఎం రేవంత్ రెడ్డి అని, పంద్రాగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుద్దామంటూ సీఎం ప్రకటన చేస్తే.. రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు రాజీనామా కట్టుబడి ఉండాలన్నారు. కానీ.. రుణమాఫీపై రాజీనామా చేస్తున్నటువంటి హరీష్ రావు ఆ తర్వాత మాట మార్చారని, రుణమాఫీ తో పాటు ఆరు గ్యారంటీలకు లింకు పెట్టారన్నారు. ఆరుగ్యారెంటీలే కాదు మరికొన్నింటిని హామీలకు లింక్ చేసి రాజీనామా పత్రాన్ని ఇవ్వడం డ్రామా అడడం కాకపోతే మరేంటి అని ఆయన మండిపడ్డారు.

 
Gold Medals: వ‌ర‌ల్డ్ ఆర్చ‌రీలో హ్యాట్రిక్ గోల్డ్ మెడ‌ల్స్ సాధించిన విజ‌య‌వాడ‌ ఆర్చర్ జ్యోతి సురేఖ‌..
 

రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు తన మాట మీద నిలబడాలన్నారు. హరీష్ రావు రాజీనామా డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. తన బిడ్డ కడియం కావ్య గెలిచాక మందకృష్ణ మాదిగ తన ఇంటికొచ్చి దండం పెడతాడని చెప్పారు.ఫోన్ ట్యాపింగ్ కామన్న అన్న కేసీఆర్ అధికారులను బలిచేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రమేయం లేకుండానే వాళ్లు ఫోన్ ట్యాపింగ్ చేశారా అని ప్రశ్నించారు.గత ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు కేసీఆరే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

 Namburu Sankara Rao: గెలిపించే బాధ్యత మీది.. అభివృద్ధి బాధ్యత నాది: నంబూరు శంకరరావు