
వియజవాడ ఎంపీగా వైసీపీ తరపున కేశినేని నాని పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మద్దతుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్ లో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టోను చూసి ప్రజలందరు చాలా హ్యాపీగా ఉన్నారని తెలిపారు. వైఎస్సార్ చేయూత కింద 1.5 లక్షల రూపాయలకు పెంచారు, అమ్మ ఒడి కూడా 15000 నుంచి 17000 రూపాయలకి పెంచారు, పెన్షన్లు 3 వేల నుంచి 3,500కు పెంచారని పేర్కొన్నారు. ఇక, నవ రత్నాలు మంచి సక్సెస్ అయ్యాయి.. కాపు నేస్తం కూడా కొనసాగిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించడం సంతోషకరమైన విషయం అని కేశినేని శ్వేత ప్రకటించారు.
Read Also: LSG vs RR: ఆదుకున్న కేఎల్ రాహుల్, దీపక్ హూడా.. రాజస్థాన్ టార్గెట్ 197..
కాగా, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల పక్షాన ఉండి ఇన్ని పథకాలు ప్రకటించారని కేశినేని శ్వేత పేర్కొన్నారు. నెక్స్ట్ టర్మ్ లో కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇంకా మంచి సేవలు అందించేందుకు సీఎం జగన్ ముందుకు వచ్చారన్నారు. కేశినేని నాని గత 10 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు అందుబాటులో ఉండి అనేక అభివృద్ధి పనులు చేశారు.. నీతిగా నిజాయితీగా నిస్వార్ధంగా పని చేసిన వ్యక్తి కేశినేని నాని అని ఆమె వెల్లడించారు. కేశినేని భవన్ ద్వారా ప్రజలకు ఎప్పుడు ఆయన అందుబాటులో ఉంటారు.. ఫ్లైఓవర్, హాస్పిటల్, ఎయిర్ పోర్ట్, ఇవ్వన్నీ కేశినేని నాని విజయవాడ ప్రాంతానికి తీసుకొచ్చి చేసిన అభివృద్ధి పనులు అని కేశినేని శ్వేత చెప్పుకొచ్చారు.
Read Also: Ap Bjp: కాంగ్రెస్ ఎక్స్ ఖాతాపై బీజేపీ ఫిర్యాదు.. అసలేమైదంటే..?
ఇక, కేశినేని నాని విజయవాడ ప్రాంత ప్రజల గుండెల్లో ఉన్నాడు అని కేశినేని శ్వేత తెలిపారు. అలాగే, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అసిఫ్ లోకల్ పర్సన్ మంచి వాడు మా వాడిగా ఆయన్నీ విజయవాడ ప్రజలు భావిస్తారు.. అసిఫ్ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.. ఎన్డీయే కూటమి తరుపున ఈ నియోజకవర్గంలో స్కామర్స్, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళని ఈ ప్రాంతానికి ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు. ప్రజలు అంతా చూస్తున్నారు.. ఈసారి విజయవాడ ఎంపీగా కేశినేని నాని, ఎమ్మెల్యేగా ఆసిఫ్ ఘన విజయం సాధిస్తారని కేశినేని శ్వేత వెల్లడించారు.