Leading News Portal in Telugu

CM Revanth Reddy : ఎంత జనాభా ఉంటే.. అంత రిజర్వేషన్లు ఇస్తామన్నది మా విధానం



Revanth Reddy

రాహుల్ గాంధీ జోడో యాత్రలో జనాభా దామాషా ప్రకారం మా రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ.. ఓబీసీ నేతలు అడిగారని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. ఎంత జనాభా ఉంటే..అంత రిజర్వేషన్లు ఇస్తాం అన్నది మా విధానమన్నారు. 1925 లో ఆర్‌ఎస్‌ఎస్‌ మొదలు పెట్టినప్పుడు రేసేర్వేషన్ లు లేని దేశం చేస్తాం అన్నారని, ఈస్ట్ ఇండియా కంపెనీ ..సముద్రం పక్కన సంసారం మొదలు పెట్టిందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా సూరత్ నుండి ఆధాని మొదలుపెట్టారని, అమిత్ షా..మోడీ లు రాజ్యాంగం మార్చాలని నిర్ణయించారన్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికి 400 సీట్లు గెలవాలని టార్గెట్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రిజర్వేషన్లు మేము అంటుంటే.. మోడీ అమిత్ షాలు బాధ్యత రహితంగా మట్లాడుతున్నారని, ఎవరి సంపాదన వాళ్లదే అని రాజ్యాంగం చెప్పిందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. భార్య ఆస్తి కూడా భర్త తీసుకోవడానికి లేదు..సుప్రీంకోర్టు ఇదే చెప్పిందని, బీజేపీ వికృత రాజకీయ క్రీడకు తెర లేపారన్నారు. రాజ్యాంగం సమూల మార్పు కి..రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రకు బీజేపీ తెర లేపారని, కిషన్ రెడ్డి.. సంజయ్ ఎన్నిసార్లు మాట్లాడినా.. అమిత్ షా..మోడీ ఎందుకు చెప్పడం లేదు బీసీ జనాభా లెక్కిస్తాం అని, బీసీ జనాభా లెక్కగట్టడం చరిత్రాత్మక అవసరమన్నారు.

అంతేకాకుండా..’ఎస్సీ, ఎస్టీ.. బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తాం అని చెప్పడం లేదు. ఈటల ఎందుకు మాట్లాడటం లేదు. రిజర్వేషన్లు రద్దు పై మోడీ..అమిత్ షా ఎందుకు మాట్లాడటం లేదు. బీసీ ఓబీసీ..రిజర్వేషన్లు పెంచుతాం అని ఎందుకు చెప్పడం లేదు. కేసీఆర్ కూడా దీనిపై మాట్లాడటం లేదు. బీజేపీ కుట్ర మీద ఎందుకు మాట్లాడటం లేదు. కేసీఆర్ కూడా ఆ భావజాలం కి అలవాటు పడ్డాడా. బిడ్డ బెయిల్ కోసం మాట్లాడకుండా ఉన్నాడా కేసీఆర్. రిజర్వేషన్లు రద్దు బీజేపీ ఆలోచనపై నీ విధానం ఏది. మా సర్కార్ ని దించాలని అంటున్న కేసీఆర్.. కేటీఆర్.. హరీష్ లు బీజేపీ కుట్రల పై ఎందుకు స్పందించడం లేదు. మేడ్చల్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బీజేపీ ని గెలిపిస్తాం అన్నాడు. బీజేపీ తో వైరం ఉంటే.. మల్లారెడ్డి ని సస్పెండ్ చేయాలి బీఆర్‌ఎస్‌. కేటీఆర్ సమర్ధించడం దేనికి సూచన, ఈటల కి వ్యతిరేకంగా కేటీఆర్ ఎప్పుడైనా మాట్లాడారా..? ఈటల కూడా కేసీఆర్ మీద మాట అనడం లేదు. భూములు అమ్మకుండా రుణమాఫీ చెయ్ అంటున్నాడు ఈటల. కేసీఆర్ అమ్మినప్పుడు మాట్లాడనే లేదు. ఈటల రుణాలు మాఫీ చేయొద్దు అంటున్నవా. అమాయకంగా నో..అత్యుత్సాహం తోనే బీజేపీ కి మద్దతు ఇచ్చాడు మల్లారెడ్డి. బీజేపీ కి మద్దతు ఇస్తుంటే.. మల్లారెడ్డి కి షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదు ఎందుకు.’ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.