Leading News Portal in Telugu

kejriwal: సునీతా కేజ్రీవాల్‌కు రిలీఫ్.. సీఎంను కలిసేందుకు తీహార్ జైలు పర్మిషన్



Sejke

ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఎట్టకేలకు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌కు అనుమతి లభించింది. సోమవారం ఆమె.. మంత్రి అతిషితో కలిసి తీహార్ జైలుకు వెళ్లారు. ఇద్దరు కలిసి సీఎం కేజ్రీవాల్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు, అలాగే ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాలపై కేజ్రీవాల్‌తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సునీతా కేజ్రీవాల్.. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.

ఇది కూడా చదవండి: Beetroot Benefits : బీట్ రూట్ జ్యూస్ ను ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఇదిలా ఉంటే సోమవారం కేజ్రీవాల్‌ను కలిసేందుకు సునీతా కేజ్రీవాల్.. జైలును పర్మిషన్ కోరారు. కానీ ఆమెకు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. మంత్రి అతిషి.. మరో ఆప్ నేతకు మాత్రం అనుమతి లభించింది. మొత్తానికి సోమవారం మధ్యాహ్నం కల్లా సునీతా కేజ్రీవాల్‌కు అనుమతి లభించడంతో.. మంత్రితో కలిసి కేజ్రీవాల్‌ను కలిశారు.

ఇది కూడా చదవండి: Maa Oori Polimera 2 : అరుదైన ఘనత సాధించిన “పొలిమేర 2”..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈడీ కస్టడీ తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. దీంతో ముఖ్యమంత్రి 40 రోజులుగా జైల్లోనే ఉన్నారు. మరోవైపు బెయిల్ పిటిషన్లను కోర్టులు తిరస్కరించాయి.