Leading News Portal in Telugu

Raghav chadha: రాఘవ్ చద్దా కంటిచూపుపై ఢిల్లీ మంత్రి ఏమన్నారంటే..!



Raee

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా గత కొన్ని రోజులుగా ఇండియాలో కనిపించడంలేదు. పైగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత కూడా ఆయన ప్రత్యక్షం కాలేదు. దీంతో ఆయనపై రకరకాలైన పుకార్లు వ్యాప్తి చెందాయి. కేసుల భయంతోనే ఆయన పరారీలో ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి. తాజాగా వీటిన్నంటికి ఢిల్లీ మంత్రి ఫుల్ స్టాప్ పెట్టారు. మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ.. కంటి శస్త్ర చికిత్స కోసం రాఘవ్ చద్దా యూకేలో ఉన్నారని.. కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని.. అలాగే భారత్‌కు తిరిగి వచ్చి ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. సకాలంలో ఆయనకు చికిత్స అందించకపోతే అంధత్వం వచ్చే అవకాశం ఉందని అని భరద్వాజ్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Thatikonda Rajaiah: ఎన్ కౌంటర్ లు చేయించిన చరిత్ర కడియం ది.. రాజయ్య కీలక వ్యాఖ్యలు

రాఘవ్ చద్దా-పరిణీతి చోప్రా ఇద్దరూ సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో నిర్వహించిన లండన్ ఇండియా ఫోరమ్ 2024లో పాల్గొన్నారు. ఈ జంట సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఫొటోలను పంచుకున్నారు.

ఢిల్లీ మద్యం కేసులో మార్చి 21న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అనంతరం ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. ఇంత జరుగుతున్న రాఘవ్ చద్దా కనిపించకపోవడంతో ఆయనపై అనేకమైన వదంతులు వ్యాపించాయి. మొత్తానికి దీనిపై ఢిల్లీ మంత్రి క్లారిటీ ఇచ్చారు. మరోవైపు స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో రాఘవ్ చద్దా పేరు కూడా ఉంది. కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టడం సరైంది కాదని రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు. ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.