Leading News Portal in Telugu

CM YS Jagan: ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు



Cm Ys Jagan

CM YS Jagan:ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన మేనిఫెస్టోపై మోడీ ఫొటో పెట్టవద్దని ఢిల్లీ నుంచి వాళ్లకు ఫోన్‌ వచ్చిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ముగ్గురు కూటమిలో ఉండి.. ముగ్గురి ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలు అన్ని వస్తాయని.. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు ఆగిపోతాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. వదలి బొమ్మాలీ అంటూ పసుపు పతి మళ్ళీ లేస్తాడు.. మీ రక్తం తాగుతాడని విమర్శించారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని వ్యాఖ్యానించారు. అన్నమయ్య జిల్లా కలికిరి ప్రచార సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. చంద్రబాబు రైతులకు ఎప్పుడైన రైతు భరోసా ఇచ్చాడా అంటూ ప్రశ్నించారు. జగన్ స్కీం అయినా రైతు భరోసాను చంద్రబాబు రెట్టింపు ఇస్తాడంటే ఎవరైనా నమ్ముతారా అంటూ ప్రశ్నలు గుప్పించారు. చంద్రబాబు ఎప్పుడైన రైతులకు ఒక్కరూపాయి అయినా ఇచ్చాడా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

Read Also: CM YS Jagan: చంద్రబాబు నీ స్కీమ్‌లు ఏమిటి?.. ఒక్కటైనా గుర్తుందా?

మీ బిడ్డ జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలు చేశాడని.. 31 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని, అమ్మఒడి, చేయూత లాంటి పథకాలు ఇచ్చిన ఘనత మాదే అని ఆయన పేర్కొన్నారు. వాలంటీర్ల ద్వారా నేరుగా పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్‌దేనన్నారు. అమ్మ ఒడిని 17వేలకు పెంచామన్నారు. పెన్షన్‌ను పెంచి 2028, 2029 నాటికి 3500 పెన్షన్ ఇస్తామన్నారు. చంద్రబాబు ఏరోజు అవ్వతాతలకు పెన్షన్ ఇవ్వలేదని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు నీ స్కీమ్‌లు ఏమిటి… మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసావు కదా అయ్యా నీ పేరు చెప్తే ఏ ఒక్కరికైనా ఒక్క స్కీమైనా గుర్తుకు వస్తుందా అంటూ సీఎం ప్రశ్నించారు.