Leading News Portal in Telugu

Divorce Affect Children : పిల్లల మానసిక స్థితిపై తల్లిదండ్రుల విడాకుల ప్రభావం ఎలా ఉంటుందంటే..?



Divorce Affect Children10

ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే విడాకుల దాకా వెళ్తున్నారు దంపతులు.. ఇరువురి మధ్య సమన్వయం లేకపోవడమే దానికి కారణమవుతోంది. ఇదొక్కటే కాకుండా పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో గొడవ జరిగినప్పుడు వారికి సర్ధిచెప్పేందుకు ఇంట్లో పెద్దలు ఉండేవాళ్లు. కాని ప్రస్తుతం అన్ని మినీ కుంటుంబాలే కాదా. ఇదే విడాకుల దాకా వెళ్లేందుకు ప్రధాన కారణంగా మారుతోందని పెద్దలు అంటుంటారు. తల్లిదండ్రుల విడాకులు పిల్లలను మానసికంగానే కాదు.. శారీరకంగా కూడా ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వారి చిన్న మనసుపై చెడు ప్రభావం చూపిస్తాయంటున్నారు. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ అవసరం. మంచి చెడు చెబుతూ.. పెంచాల్సిన తల్లిదండ్రులే పలు కారణాలతో విడాకుల వరకు వెళ్లడంతో పిల్లలు మానసికంగా కుంగిపోతారు.

READ MORE: Sonu Sood: పిచ్చండీ ఇది.. సోనూసూద్ కోసం 1500 కి.మీ పరిగెత్తుకొచ్చిన ఫ్యాన్!

6-12 సంవత్సరాల వయసున్న పిల్లలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వయస్సు పిల్లలకు సరైన మెచ్యూరిటీ ఉండదు. అన్ని విషయాలను వారు అర్థం చేసుకోలేరు. కానీ వారు అడిగే ప్రశ్నలు చాలా లోతైనవి. తమ తల్లిదండ్రులతో కలిసి జీవించాలని కోరుకుంటుంటారు. వారితో కలిసి బయట ప్రపంచంలో తిరగాలను కుంటారు. ముఖ్యం గా ఈ వయసులో జరిగిన మంచి చెడు సంఘటనలను జీవితాంతం మర్చిపోరు. అందుకని ఈ వయస్సులో తల్లిదండ్రులు పిల్లలకు దగ్గరగా ఉండాలి. మంచి చెడులు వివరిస్తూ.. వారిని పెంచాలి. తద్వారా వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. తల్లిదండ్రుల విడాకుల వార్త వినగానే పిల్లలు గందరగోళం, కోపం, విచారం, భయం వంటి భావాలను అనుభవిస్తారు.

నిన్నటి దాకా కలిసి ఉన్న తల్లిదండ్రులు రేపటి నుంచి కలిసి ఉండరు అనే చేదు నిజం వారిని మానసికంగా, శారీరకంగా కుంగదీస్తుంది. ఇంట్లో వాతావరణం పిల్లలకు ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో వారు అభద్రతా భావానికి గురవుతున్నారు. తాము ఎంచుకున్న లక్ష్యంపై సరిగ్గా పోకస్ చేయలేరు. ఆ వయసులో వారికి చదువు చాలా ముఖ్యం అది దెబ్బతింటుంది. వారు చదువుకునే విద్యాసంస్థల్లో ఇతర విద్యా్ర్థులతో సంబంధాలు బాగా ఉండవు. ఈ అంశం పిల్లలు మరింత కుంగిపోయేలా చేస్తుంది. విడాకుల తర్వాత పిల్లలు తల్లితో కొన్ని రోజులు, తండ్రితో కొన్ని రోజులు గడపాల్సి వస్తుంది. ఇది వారి సంబంధంలో ఉద్రిక్తతకు కారణమవ్వడమే కాకుండా వారిని నిందించేందుకు కూడా అవకాశం లేకపోలేదు. తల్లిదండ్రుల విడాకులు పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి.చాలా విషయాల్లో వెనకడుగు వేస్తారు. అందుకే కనీసం పిల్లల కోసమైన వారి వారి మొండి వైఖరులను పక్కన పెట్టి కలిసి ఉండేందుకు ప్రయత్నించాలి.