Leading News Portal in Telugu

Money Seized: చొక్కాలో 20 లక్షల నగదు.. పుష్పరాజ్‌నే మించిపోయాడుగా..!



Money Seized

ఒక వ్యక్తి కారు బైక్ లో పెట్టకుండా తన చొక్కాలు 20 లక్షల నగదు 27 తులాల బంగారం తీసుకుని వెళ్ళవచ్చా ఏమో కానీ ఈ యువకుడు తన చొక్కాలో దాచిపెట్టుకొని అంత పెద్ద మొత్తంలో డబ్బుని తీసుకు వెళుతు వుండగా పోలీసులు పట్టుకున్నారు.పుష్ప సినిమా తరహాలో డబ్బులని చొక్కల్లో దాచుకున్న యువకుడు పట్టుబడిన వైనం ఇది. ఖమ్మం జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఘటన జరిగింది. గత రాత్రి పోలీసులు తనిఖీలు చేస్తుంటే ఒక యువకుడు అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతని పట్టుకోగా అతని జీవన నుంచి కట్టలు కట్టలుగా డబ్బులు బయటపడ్డాయి .. పాయింట్ జేబులోంచి అదేవిధంగా బనీన్లో నుంచి డబ్బులు కట్టలు దొరికాయి .అంతేకాకుండా ఒక జర్కిన్ కూడా లోపల వేసుకొని ఆ జర్కిన్ లో కూడా జిప్పుల లోపల డబ్బులు దాచి పెట్టాడు. అయితే అతను అలా ఎందుకు ఎక్కడికి తీసుకు వెళుతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. 20 లక్షల నగదు, 27 తులాల బంగారం తీసుకుని వెళుతుండగా సిఐ రాజిరెడ్డి పట్టుకున్నారు.