Leading News Portal in Telugu

Varalaxmi: పెళ్లికి ముందే వరలక్ష్మికి మైండ్ బ్లాకయ్యే గిఫ్ట్ ఇచ్చిన కాబోయే భర్త!



Nicolai Varalakshmi

Nicolai Sachdev gifts a Bunglow to Varalaxmi Sarathkumar: నటుడు శరత్‌కుమార్‌ కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసినా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి. బోల్డ్ యాక్టింగ్, బోల్డ్ వాయిస్ తో ఆమె నటన ఇతర నటులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున తెలుగు సినిమాలు కూడా చేస్తూ ఆమె బిజీ బిజీగా ఉంది. అయితే నటనలో బిజీగా ఉన్న వరలక్ష్మి ప్రేమలో కూడా పడింది. నికోలాయ్‌ అనే గ్యాలరిస్టుతో ప్రేమలో ఉన్న వరలక్ష్మి అతనితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఇక నిజానికి ఇలా ఎంగజ్మెంట్ ఆమె ప్రకటిస్తుందని చాలా మంది ఊహించలేదు. అయితే ఆమె ఇలా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఇంకా పెళ్లి జరగని తరుణంలో నికోలాయ్‌ వరలక్ష్మికి ఖరీదైన బహుమతిని ఇచ్చాడని తెలుస్తోంది.

Ajith Fan Arrested: విజయ్ సినిమా బ్యానర్‌ చింపిన అజిత్ ఫ్యాన్ అరెస్ట్

నికోలాయ్ వరలక్ష్మిని ముంబైలో మొత్తం రెండు బంగ్లాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. బంగ్లాలలో అన్ని విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయని వాటి ధర కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘శబరి’. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించగా దర్శకుడు బి గోపాల్, ఏఎస్ రవికుమార్ చౌదరి, మదన్ దగ్గర పలు చిత్రాలకు పని చేసిన అనిల్ కాట్జ్ ‘శబరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అవుతోంది. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ప్రమోషన్స్ లో అడిగిన సంధర్భంలో ఇప్పుడు పనితోనే తన పెళ్లి అవుతోందని, త్వరలో ఆ పెళ్లి కూడా చేసుకుంటానని వరలక్ష్మీ చెప్పుకొచ్చింది.