Leading News Portal in Telugu

Ajith Fan Arrested: విజయ్ సినిమా బ్యానర్‌ చింపిన అజిత్ ఫ్యాన్ అరెస్ట్



Ajith Fan Arrested

Ajith Fan Arrested for Tearing Vijay Gilli Flexy: 2001లో ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో అజిత్ కుమార్, లైలా, సురేష్ గోపి నటించిన చిత్రం ‘దీనా’. యువన్‌శంకర్‌రాజా సంగీతం సమకూర్చారు. ఈ సినిమా తర్వాతనే అజిత్ ‘తల’ అనే టైటిల్‌తో పాపులర్ అయ్యాడు. ఈ సందర్భంలో, 23 సంవత్సరాల తర్వాత ‘దీనా’ చిత్రాన్ని అజిత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా నిన్న (మే 1) డిజిటల్ ‘రీ-రిలీజ్’ చేశారు. ఈ సందర్భంలో చెన్నైలోని ఓ థియేటర్‌లో ‘దీనా’ సినిమాని రిలీజ్ చేశారు. దీంతో అభిమానులు కేక్ కట్ చేసి పటాకులు పేల్చి ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. దానికి తోడు ఏకంగా కొందరు థియేటర్లోనే పటాకులు పేల్చారు. దీంతో థియేటర్‌ను పటాకుల మంటలు, పొగలు చుట్టుముట్టాయి. దీంతో కాసేపు తోపులాట కూడా జరిగింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. అదేవిధంగా చెన్నైలోని కాశీ థియేటర్‌లో దీనా రీ-రిలీజ్ సందర్భంగా అజిత్ అభిమానులు భారీ బ్యానర్‌తో సంబరాలు జరుపుకున్నారు.

Music Director: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. 28 ఏళ్ళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి..

అదే థియేటర్‌లో ఉంచిన గిల్లి రీ రిలీజ్ బ్యానర్‌ను అజిత్ అభిమాని చించివేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ కేసులో గిల్లి బ్యానర్‌ను చింపివేసినందుకు అజిత్ అభిమాని ఎబినేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం, అసభ్యకరంగా మాట్లాడటం సహా 2 సెక్షన్ల కింద ఎంజీఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారని చెబుతున్నారు. ఇక ఈ సందర్భంలో థియేటర్‌లోని బ్యానర్‌ను చింపివేసిన వ్యక్తి క్షమాపణలు చెబుతున్న వీడియో కూడా ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఇందులో ఎబినేష్ మాట్లాడుతూ.. కాశీ సినిమాస్ లో దీనా సినిమా చూడ్డానికి వెళ్ళాను. ఫ్రెండ్స్‌తో ఉన్న ఉత్సాహంతో నేను గిల్లి బ్యానర్‌ని చించివేశాను. అందుకు నేను విజయ్ అన్న, తమిళనాడు వెట్రి కజగం మిత్రులకు క్షమాపణలు చెబుతున్నాను. నేను ఇలాంటి సంఘటనలకు పాల్పడనని చెబుతూ క్షమాపణలు కోరుతున్నా అనిచెప్పుకొచ్చాడు.