Leading News Portal in Telugu

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్.. అధికారికంగా ప్రకటించిన అదితి రావ్ హైదరీ..



Whatsapp Image 2024 05 03 At 7.49.10 Am

కోలీవుడ్ హీరో సిద్దార్థ్,హీరోయిన్ అదితి రావ్ హైదరీ రిలేషన్ లో వున్న విషయం తెలిసిందే.వీరిద్దరూ “ఆర్ ఎక్స్100” దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన మహాసముద్రం మూవీలో కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరిద్దరి పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం.అప్పటి నుండి ఈ జంటపై వరుసగా గాసిప్స్ వచ్చేవి.ఇదిలా ఉంటే గత నెలలో వీరు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నసంగతి తెలిసిందే. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో ఈ వేడుక జరిగింది.ఈ నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు.అయితే నటి అదితి రావ్ హైదరీ వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో ఒకరు. దీంతో పురోహితులు దగ్గరుండి ఈ వేడుక జరిపించారు. అయితే నిశ్చితార్థంపై ఇప్పటివరకు అదితి రావు హైదరీ ఎటువంటి ప్రకటన చేయలేదు .

ఇదిలావుంటే తాజాగా ఈ నిశ్చితార్థంపై అదితి రావ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.తన తల్లి కోరిక మేరకు నాకు నిశ్చితార్థం అయినట్లు బహిరంగంగా ప్రకటిస్తున్నట్లు అదితి వెల్లడించారు. నా ఎంగేజ్‌మెంట్ అయిన రోజు చాలా మంది మా అమ్మకు కాల్ చేసి నిజంగానే అదితి పెళ్లి చేసుకోబోతుందా అని అడిగేవారు.. ఇక అమ్మ కూడా వారి బాధ చూడలేక మీరే అధికారికంగా ప్రకటించండి . నాకు నాన్‌స్టాప్ కాల్స్ వస్తున్నాయి అంటూ తెలిపింది. దీంతో నేను, సిద్ధార్థ్‌ ఈ విషయంపై పోస్ట్‌లు పెట్టాం.తన నిశ్చితార్థం 400 ఏళ్ల నాటి గుడిలో చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ గుడితో తన ఫ్యామిలీకి ప్రత్యేక అనుబంధం ఉంది అని ఆమె తెలిపింది .