Leading News Portal in Telugu

Operation Chirutha Success: ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత.. నెహ్రూ జూపార్క్‌కు తరలింపు



Operetion Chirutha Sucses

Operation Chirutha: ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో బోనులో చిరుత చిక్కింది. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ఐదు రోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఆరు రోజులపాటు అధికారులను ముప్పు తిప్పలు పెట్టిన చిరుత. ఏకంగా ఏర్పోర్ట్ రన్ వే మీదికి వచ్చింది. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ పోలీసులు సిఐఎస్ఎఫ్ అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు బోన్ లో చిరుత చిక్కడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పులి కోసం ఐదు బోన్లు, 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మేకలను బోనుల్లో ఉంచినప్పటికీ అది చిక్కుకోలేదు. పలుమార్లు బోను దగ్గరికి వెళ్లిన చిరుత మళ్లీ వెనక్కి వెళ్లిన సంగతి తెలిసిందే.

Read also: Election Commission: రాజకీయ పార్టీలకు ఈసీ వార్నింగ్.. ఎందుకో తెలుసా..?

అయితే శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మేకను తినేందుకు బోను వద్దకు వెళ్లిన చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పులిని నెహ్రూ జూపార్క్‌కు తరలించనున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఒకరోజు పాటు పర్యవేక్షణలో జూ అధికారులు ఉంచనున్నారు. తర్వాత నల్లమల అడవిలో అటవీ శాఖ అధికారులు చిరుతను వదిలేస్తామని తెలిపారు. గత ఆదివారం (ఏప్రిల్ 28) ఉదయం గొల్లపల్లి నుంచి భద్రతా గోడ దూకి శంషాబాద్ విమానాశ్రయంలోకి చిరుత ప్రవేశించింది. దూకుతున్న సమయంలో ప్రహరీ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్లకు తగిలి ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ రూమ్‌లో అలారం మోగింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌లైన్స్ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత కోసం పులి కోసం ఐదు బోన్లు, 20 సీసీ కెమెరాలు, మేకలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Home Voting: హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో నేడు, రేపు హోం ఓటింగ్‌..