
Election Commission directs political parties: పొలిటికల్ పార్టీలకు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా వార్నింగ్ ఇచ్చింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రతిపాదిత లబ్ధిదారుల పథకాల కోసం వివిధ సర్వేల ముసుగులో ఓటర్ల వివరాలను కోరడం ఎన్నికల చట్టం ప్రకారం అవినీతి పద్ధతి అని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఎన్నికల వేళ సర్వేలు, పథకాల లబ్ధి సాకులతో ఓటర్ల వివరాలు సేకరిస్తే రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని సూచించింది. ఈ చర్యలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Aa Okkati Adakku Twitter Review : అల్లరోడు మరో హిట్ కొట్టినట్లేనా..?
అలాగే, ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లపై ప్రచురణకర్తలను, ప్రింటింగ్ వివరాలు లేకపోతే చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇక, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. అవినీతి ప్రవర్తనకు సమానమైన ఇలాంటి కార్యకలాపాలను నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇంటింటికీ గ్యారెంటీ కార్డుల ప్రచారాన్ని అవినీతి అక్రమంగా కాంగ్రెస్ అభివర్ణించిందని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే, సర్వేల నెపంతో ఓటర్లను తప్పుదోవ పట్టించడం, ప్రలోభ పెట్టడం వంటి నేరాల కిందకే వస్తాయి.. కాబట్టి వీటిపై నిషేధం విధిస్తున్నట్లు ఈసీ పేర్కొనింది.