Online Transactions: జాగ్రత్త సుమీ.. ఆన్లైన్ ట్రాన్స్యాక్షన్ ఎక్కువ చేస్తున్నారా.. లావాదేవీలపై ఈసీ నిఘా..

ఎన్నికల సమయంలో ఓటర్లను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు రాజకీయ నాయకులు డబ్బుతో, మద్యంతో ఓటర్లను మభ్యపెట్టే పనిలో పడ్డారు. ఈ విధంగా నగదు, మద్య పానీయాలు పెద్ద ఎత్తున రవాణా అవుతాయి. ఎన్నికల కమిషన్ ఈ సమస్యను పరిశీలిస్తోంది. ఎక్కడికక్కడ అక్రమ డబ్బు, మద్యం రవాణాకు అడ్డుకట్ట పడుతుంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అధికారులు ముమ్మరంగా తనికీలు చేస్తున్నారు. ఎవరైనా వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న మద్యం, నగదును గుర్తించి సీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పెద్ద మొత్తంలో నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Budi Mutyala Naidu vs Budi Ravi: రచ్చకెక్కిన తండ్రీకొడుకులు.. డిప్యూటీ సీఎం సొంతూరు తారువలో ఉద్రిక్తత
నగదు పంచితే పట్టుబడతామని తెలిసి కొందరు., కొత్తగా ఆన్లైన్ లావాదేవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా డబ్బు పంపిణీ చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా ఎన్నికల కమిషన్ హెచ్చరిక వచ్చింది. ఆన్లైన్ లావాదేవీలను కూడా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది ఈసీ.
Also Read: Weather Update: దేశవ్యాప్తంగా దంచికొడుతున్న ఎండలు.. ఈ రాష్ట్రాల్లో హీట్‌వేవ్ అలర్ట్
ఎన్నికల్లో నిధుల పంపిణీపై ఎన్నికల కమీషన్ తన పర్యవేక్షణను వేగవంతం చేస్తోంది. ఆన్లైన్ లావాదేవీలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లావాదేవీలు కూడా పర్యవేక్షించబడతాయి. కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఆన్లైన్ లావాదేవీలను చూస్తుంది. ఈ నిధుల పంపిణీపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన షాడో టీమ్ విచారణ జరుపుతోంది. తెలంగాణలో ఇప్పటికే రూ.250 కోట్ల నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా నగదు, మద్యం జప్తు చేయబడ్డాయి. ఆన్లైన్ లావాదేవీల కోసం ఢిల్లీ నిర్వచన్ సదన్‌లో ఓ ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశారు అధికారులు.