Leading News Portal in Telugu

Dadisetti Raja: సంక్షేమం, అభివృద్ధి అంటే ఏంటో జగన్‌ చూపించారు..



Dadisetti Raja

Dadisetti Raja: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అందరి ఫోకస్ తుని అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక సెగ్మెంట్‌లో మరోసారి విజయకేతనం ఎగరవేయాలని అధికార వైసీపీ ఆశిస్తోంది. గెలుపు కోసం ఆ పార్టీ అభ్యర్థి, మంత్రి దాడిశెట్టి రాజా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు మంత్రి దాడిశెట్టి రాజా. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తుని వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. గత ఐదేళ్లలో సంక్షేమం, అభివృద్ధి అంటే ఏంటో జగన్ చూపించారని, మరొక అవకాశం ఇవ్వాలని కోరారు.

మరోవైపు తుని మండలం ఎస్.అన్నవరం పంచాయతీ కొత్త సూరవరంలో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో తుని వైసీపీ అభ్యర్థి రాజా కుమారుడు దాడిశెట్టి శంకర్ మల్లిక్ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసారు. తన తండ్రి దాడిశెట్టి రాజాకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అవ్వతాతలకు జగనన్న సీఎం అయితేనే పెన్షన్లు ఇంటికి పంపిస్తారని వివరించారు. రాష్ట్రంలో మంచి పాలన అందిస్తున్న జగనన్నకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. మళ్లీ దాడిశెట్టి రాజాను గెలిపిస్తే తుని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు.