Leading News Portal in Telugu

VadaPav Girl: ఆ విషయంలో ‘వడాపావ్ గర్ల్‌’ ను అరెస్టు చేసిన పోలీసులు.. వైరల్ వీడియో..



Vodapav Girl

సోషల్ మీడియాకు ఉన్న ప్రాధాన్యత కారణంగా ఈ మధ్య కాలంలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు బాగా పాపులర్ అవుతున్నారు. వారి కార్యకలాపాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. మన తెలుగు రాష్ట్రాల్లో ‘కుమారి ఆంటీ’ ఇలానే మంచి పేరు తెచ్చుకొని చాలా పాపులర్ అయ్యింది. ఇకపోతే ఆమె దుకాణానికి సీఎం వస్తానని హామీ ఇవ్వడంతో ఆమె మరింత స్టార్ అయిపోయింది.

Also Read: Teacher Arrest: విద్యార్థికి బలవంతంగా పోర్న్ వీడియో చూపించిన కేసులో టీచర్ అరెస్ట్.. ఎక్కడంటే..

ఢిల్లీ చాయ్ వాలా వద్ద బిల్గెట్స్ టీ తాగుతున్న వీడియో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అదే సమయంలో చాలా మంది సెలబ్రిటీలు లాగానే ఓ అమ్మాయి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ అమ్మాయి పేరు ఢిల్లీకి చెందిన ‘వడపావ్ గర్ల్’ గా గుర్తుకు వస్తుంది. ఢిల్లీలోని మంగోల్‌ పురి ప్రాంతంలో చంద్రికా దీక్షిత్ గురించి తెలియని వారు లేరు. ఆమె తన అసలు పేరుతో కాకుండా ‘వడపావ్ గర్ల్’ పేరుతో ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. రోడ్డు పక్కన వడ పావ్‌ విక్రయిస్తున్న దీక్షితను తాజాగా ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వడాపావ్ స్టాండ్ వద్ద భారీగా జనం గుమిగూడారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. ఈ సమయంలో, ఢిల్లీ పోలీసులకు భండారా సమయంలో ట్రాఫిక్ జామ్‌ లపై ఫిర్యాదులు అందాయి.

Also Read: Bank Robbery: పట్టపగలే ఎస్‌బీఐ బ్యాంకులో దోపిడీ.. రూ.20 లక్షలు స్వాహా..

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన దీక్షితను అరెస్ట్ చేశారు. ఈ విషయంలో ఆమె వడపావ్ స్టాండ్‌ ను కూడా సీజ్ చేసారు అధికారులు. అయితే దీక్షిత్‌ను పోలీసులు ఈడ్చుకెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ.. దీక్షితపై ఎలాంటి కేసు నమోదు కాలేదని ఆమెను అరెస్ట్ చేయలేదని తెలిపారు.