Karnataka s*x scandal: సెక్స్ టేపుల వ్యవహారంలో రేవణ్ణకి షాక్.. అరెస్ట్ నుంచి రక్షణకు కోర్టు నిరాకరణ..

Karnataka s*x scandal: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం కర్ణాటకలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సుమారుగా 3000 వేల వీడియోలు వెలుగులోకి రావడం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. రేవణ్ణ కుటుంబానికి పట్టున్న హహస్ జిల్లాలో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. మరోవైపు రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు అతని తండ్రి హెచ్‌డీ రేవణ్ణ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం బయటకు రావడంతో ప్రజ్వల్ దేశం వదిలి జర్మనీకి వెళ్లాడు. ఈ కేసు విచారణ నిమిత్తం కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
Read Also: Teacher Arrest: విద్యార్థికి బలవంతంగా పోర్న్ వీడియో చూపించిన కేసులో టీచర్ అరెస్ట్.. ఎక్కడంటే..
మరోవైపు హెచ్‌డీ రేవణ్ణ కూడా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఒక మహిళ కిడ్నాప్ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు మధ్యంతర రక్షణ కల్పించాలనే అభ్యర్థనను స్థానిక కోర్టు తిరస్కరించింది. ఇటీవల ఓ మహిళ కనిపించకుండా పోయింది. ఈ వ్యవహారంలో హెచ్‌డీ రేవణ్ణ, అతని సహాయకుడు సతీష్‌పై కిడ్నాప్ కేసు నమోదైంది. సదరు మహిళ 5 ఏళ్ల పాటు రేవణ్ణ ఇంట్లో పనిచేసి, మూడేళ్ల క్రితం అక్కడ పని మానేసింది. ఏప్రిల్ 26న సతీష్ ఆమెను రేవణ్ణ పిలుస్తున్నాడని బలవంతంగా తీసుకెళ్లాడు. ఆ తర్వాత అదే రోజు ఇంటికి తీసుకువచ్చాడు. మళ్లీ ఏప్రిల్ 29న ఆమెను మళ్లీ తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయింది. బాధిత మహిళ కుమారుడు తన తల్లి కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసు నమోదైంది.