
Tamil Nadu: తమిళనాడు కాంగ్రెస్ నేత అనుమానాస్పద స్థితిలో మరణించారు. రెండు రోజులుగా కనిపించకుండా వెళ్లిన అతను, అతని సొంత వ్యవసాయ క్షేత్రంలో మృతి చెందాడు. ఇది హత్య..? ఆత్మహత్యా.?. అనే కోణంలో మూడు పోలీస్ టీంలు దర్యాప్తు చేపట్టాయి. శనివారం తిరునల్వేలిలో కేపీకే జయకుమార్ మృతదేహాన్ని కాలిపోయిన స్థితిలో గుర్తించారు. ఆయన తిరునల్వేలి కాంగ్రెస్ తూర్పు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: ముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జలతో చర్చించిన జేఏసీ నేతలు
జయకుమార్ గురువారం అదృశ్యమయ్యాడు. దీనిపై మరుసటి రోజు అతని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చనిపోవడానికి సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఉంది అతని చేతిరాతనా కాదా..? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జయకుమార్‌ది హత్యా, ఆత్మహత్య అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు మూడు ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.