Leading News Portal in Telugu

Andhra Pradesh: ఏపీలో నడి రోడ్డుపై కొట్టుకున్న కానిస్టేబుళ్లు.. వీడియో వైరల్‌



Constables

Andhra Pradesh: ఏదైనా ఆపద వచ్చిందంటే సమాచారం అందితే చాలు పోలీసులు వాలిపోతారు.. పది మందిని కాపాడడంలో పోలీసులు డిపార్ట్‌మెంట్‌ ముందువరుసలో ఉంటుంది.. కష్టమేదైనా.. నష్టం జరుగుతున్నా.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. బరిలో దిగేవాడే పోలీసులు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌ లో ఇద్దరు పోలీసులు.. నడిరోడ్డుపైకి వచ్చి పబ్లిక్‌గా కొట్టుకోవడం చర్చగా మారింది.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది..

Read Also: Sobhita Dhulipala :నాగచైతన్య రూమర్స్.. బుజ్జి బంగారం అంటూ శోభిత పోస్ట్..

ఏపీలో కానిస్టేబుళ్లు నడిరోడ్డుపై ఘర్షణకు దిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా రొల్ల మండలం పిల్లిగుండ్లు చెక్ పోస్టులో శివ, నారాయణస్వామి అనే ఇద్దరు కానిస్టేబుళ్లు బాహాబాహీకి దిగారు.. ఒకరికొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఇంతకీ ఇద్దరు కానిస్టేబుళ్ల మధ్య ఘర్షణకు దారి తీసిన విషయం ఏంటంటే.. ? సాయంత్రం డ్యూటీ షిఫ్ట్ ఆలస్యం అయిందనే విషయంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది.. అది కాస్తా వాగ్వాదానికి దారితీసింది.. ఇద్దరూ సహనం కోల్పోయారు.. రోడ్డుపైకి ఎక్కారు.. ప్రజలంతా చూస్తుండగానే నడి రోడ్డుపై కొట్టుకున్నారు ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఇక, ఏదైనా కాస్త భిన్నంగా కనిపిస్తే.. ఎప్పుడు వీడియో చూద్దామా? సోషల్‌ మీడియాలో పెడదామా? అని చూసే ఈ రోజుల్లో.. ఓ వ్యక్తి కానిస్టేబుళ్ల వ్యవహారాన్ని తన మొబైల్‌ ఫోన్‌లో బంధించాడు.. ఆ తర్వాత అది సోషల్‌ మీడియాకు ఎక్కి వైరల్‌గా మారిపోయింది.