Leading News Portal in Telugu

Rana daggubati : ఆయనే ఇన్స్పిరేషన్.. అదొక్కటే డ్రీమ్



Whatsapp Image 2024 05 06 At 10.33.25 Am

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వేట్టయాన్‌’..ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్లాక్‌బాస్టర్‌ మూవీ ‘జైలర్‌’ సినిమా తర్వాత ఆయన పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న చిత్రం ‘వేట్టయాన్‌’.ఈ సినిమాను జై భీం ఫేమ్ దర్శకుడు టి.జె.జ్ఞానవేల్‌ తెరెకెక్కిస్తున్నారు.ఈ సినిమా లో హీరో రానా కీలక పాత్ర పోషిస్తున్నారు.తాజాగా రానా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.  రానా  మాట్లాడుతూ ఈ సినిమాలో నేను భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని రానా తెలియజేసారు.

రజనీ సార్‌తో నటించాలనేది నా చిన్ననాటి డ్రీం .ఆయన తో సినిమా చేసే అవకాశం ఇప్పుడు దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉందని రానా తెలిపారు.ముందుగా దర్శకుడు టి.జె.జ్ఞానవేల్‌ ఈ సినిమా కథ చెప్పగానే నేను షాక్‌ అయ్యాను. అద్భుతమైన కథ చెప్పి నన్ను తొలి సిట్టంగ్‌లోనే ఇన్‌స్పైర్‌ చేశాడని రానా తెలిపారు. జ్యుడిషియల్‌ వ్యవస్థ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఎంతో పరిశోధన చేసి జ్ఞానవేల్‌ అద్భుతమైన స్క్రిప్ట్ రాసుకున్నారు.అయితే ఇది రజనీ మార్క్‌ సినిమా  కాదని రానా తెలిపారు.ఈ సినిమా తలైవా ఇమేజ్‌కి పూర్తి భిన్నంగా ఉంటుందని రానా తెలిపారు.అయితే అమితాబ్‌జీ కూడా ఈ సినిమాలో భాగం కావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.ఇద్దరు దిగ్గజ నటులతో కలిసి నటిస్తున్నందుకు గర్వంగా ఉందని రానా తెలిపారు.