Leading News Portal in Telugu

Harirama Jogaiah Letter: మరో లేఖ రాసిన హరిరామజోగయ్య… పవన్‌కు అధికారం దక్కించడమే ధ్యేయం..



Harirama Jogaiah

Harirama Jogaiah Letter: వరుసగా లేఖలు విడుదల చేస్తూ వస్తున్న మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరి రామ జోగయ్య.. తాజాగా మరో లేఖ రాశారు.. కాపు బలిజ సంక్షేమ శాఖ సభ్యులకు విజ్ఞప్తి అంటూ లేఖ విడుదల చేశారు.. కాపు కుల వ్యతిరేకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని విమర్శించిన కాయన.. ఈ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌, వైసీపీ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు అధికారం దక్కించడమే కాపు సంక్షేమ సేన ధ్యేయం అని స్పష్టం చేశారు.. పవన్ కల్యాణ్‌.. అధిపత్యంలో జనసేన – టీడీపీ – బీజేపీ కూటమి అభ్యర్థుల అందరిని నేగ్గించుకోవాలని సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను కలుపుకుని కూటమి అభ్యర్థులు.. ముఖ్యంగా జనసేన పార్టీకి చెందిన 21 మంది అభ్యర్థుల విజయానికి కృషి చేయాలంటూ కాపు బలిజ సంక్షేమ శాఖ సభ్యులు, కాపులకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరి రామ జోగయ్య.

Read Also: CPI Narayana: అందాలు, ప్యాషన్ పోటీ పెడితే.. మోడీ కి ప్రథమ బహుమతి వస్తుంది..