
సార్వత్రిక ఎన్నికల వేళ జార్ఖండ్‌లో భారీ నోట్ల డంప్ బయటపడింది. ఇప్పటి వరకు రూ.30 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా.. ఇంకా లెక్కింపు కొనసాగుతోంది. ఇంత భారీ స్థాయిలో నగదు వెలుగుచూడడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ వైపు దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంకోవైపు ఎన్నికల అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడా తనిఖీలు చేస్తున్నారు. అయినా లీడర్లు ఏ మాత్రం భయపడడం లేదు. ఏకంగా ఓ మంత్రి సహాయకుడికి చెందిన హౌస్‌కీపర్ ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈడీ అధికారులు చేసి దాడుల్లో ఇప్పటి వరకు రూ.30 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. 12 గంటల్లో ఆరు యంత్రాలతో కౌంటింగ్ చేశారు. ఇంకా కౌంటింగ్ జరుగుతోంది. ఇంకొన్ని కోట్లు వస్తాయో చూడాలి. ఇదిలా ఉంటే కొన్ని యంత్రాలు చెడిపోవడంతో.. కొత్తగా మరికొన్ని యంత్రాలు తెచ్చినట్లుగా తెలుస్తోంది. నోట్ల కట్టలకు చెందిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి మంత్రి, కాంగ్రెస్ నాయకుడు అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంటి సహాయకుడి ఇంట్లో ఈ కరెన్సీ నోట్ల కట్టలు వెలుగుచూశాయి. జార్ఖండ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్‌కు సంబంధించిన అరడజను ప్రాంగణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం దాడుల్లో చేసి ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో మనీలాండరింగ్ కేసులో వీరేంద్ర రామ్‌ని గత ఏడాది అరెస్టు చేశారు.
దర్యాప్తులో భాగంగా వీరేంద్ర రామ్‌కు చెందిన 10కి పైగా ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. పలు ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలకు పాల్పడ్డారని, రూ.100 కోట్ల మేర కూడబెట్టారని వీరేంద్రపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నేతలతో ఆయన జరిపిన లావాదేవీల వివరాలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను ఇదివరకే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగానే సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఒక మంత్రి సహాయకుడికి చెందిన ఇంట్లో ఇంత మొత్తంలో నగదు బయటపడడంతో బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. జార్ఖండ్‌లో ఇంకా అవినీతి ముగిసిపోలేదని. ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికల్లో భాగంగా సదరు వ్యక్తులు దీనిని ఉపయోగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోందని చెప్పింది. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.
ఇదిలా ఉంటే సోమవారం ఏపీలోని రాజమండ్రిలో జరిగిన సభలో ప్రధాని మోడీ ఈ అంశాన్ని లేవనెత్తారు. జార్ఖండ్‌లో కాంగ్రెస్ నేతకు చెందిన ఇళ్లల్లో భారీ స్థాయిలో నగదు దొరికిందని చెప్పారు. భవిష్యత్‌లో మరింత నల్లధనాన్ని వెలికితీస్తామని చెప్పుకొచ్చారు.
चौकिएं मत।यह किसी सरकारी बैंक के कैश वाल्ट का दृश्य नहीं है ।यह झारखंड सरकार के मंत्री आलमगीर आलम जी के निजी सचिव के घर में @dir_ed के द्वारा की गई रेड के दौरान बरामद करोड़ों रुपए का खजाना है,जिसे झारखंड के आदिवासी मूलवासी जनता से लूटा गया है।
निजी सचिव की तनख्वाह 35-40 हजार रुपए… pic.twitter.com/qGpqGrL82T— Pratul Shah Deo
(Modi ka Parivar) (@pratulshahdeo) May 6, 2024
30 करोड़ रुपए से अधिक और काउंटिंग जारी… आज ED की कार्रवाई में कॉंग्रेस विधायक दल के नेता व झारखंड सरकार के भ्रष्टाचार शिरोमणि हेमंत सरकार के मंत्री आलमगीर आलम के पर्सनल सेक्रेट्री संजीव लाल के खिलाफ बड़ी कार्रवाई…संजीव लाल के आवास पर @dir_ed को मिला 30 करोड़ से अधिक कैश ।… pic.twitter.com/xuJVNRLQzJ
— Dr Nishikant Dubey(Modi Ka Parivar) (@nishikant_dubey) May 6, 2024