Leading News Portal in Telugu

Vivo Y18 Series Launch: అదిరిపోయే ఫీచర్స్ తో వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్.. ధర ఎంతంటే?



Vivo Y8

ప్రముఖ మొబైల్ కంపెనీ వివో సరికొత్త ఫీచర్స్ తో అదిరిపోయే స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది.. ఇటీవల విడుదలైన ఫోన్లకు అప్డేటెడ్ గా ఈ ఫోన్లు వచ్చేశాయి.. మార్కెట్ లోకి తాజాగా వివో Y18, వివో Y18e లాంచ్ అయ్యాయి.. ఈ హ్యాండ్‌సెట్‌లు ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో చిప్‌సెట్‌ల ద్వారా పవర్ అందిస్తాయి. ఆండ్రాయిడ్ 14-ఆధారిత యూఐ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ అవుతాయి. ఇంకా అదిరిపోయే ఫీచర్స్, ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫీచర్స్ విషయానికొస్తే.. 6.56-అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉన్నాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 4జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ వరకు ఇఎమ్ఎమ్‌సీ 5.1 ఇంటర్నల్ స్టోరేజీతో 12ఎన్ఎమ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ85 ఎస్ఓసీ ద్వారా అందిస్తాయి.. ఇక సెల్ఫీ ప్రియులకు ఈ ఫోన్ బెస్ట్ అనే చెప్పాలి.. 50ఎంపీ ప్రైమరీ రియర్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 8ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.. బ్యాటరీని చూస్తే.. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీల సపోర్టుతో ఉన్నాయి.. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంది..

ధర విషయానికొస్తే… వివో నుంచి తాజాగా విడుదలైన రెండు ఫోన్లు 4జీబీ+ 64జీబీ మోడల్ ధర రూ. 8,999, 4జీబీ+ 128జీబీ ధర రూ. 9,999కు అందిస్తుంది. ఈ వివో ఫోన్ జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ ఆప్షన్లలో లభిస్తున్నాయి .. అలాగే e సిరీస్ మొబైల్ 4జీబీ+64జీబీ ఆప్షన్లలో వస్తుంది. వివో ఫోన్ ధర రూ. 7,999 ఉన్నట్లు తెలుస్తుంది… కొన్ని బ్యాంకుల ద్వారా కొనుగోలు చేస్తే ఆఫర్స్ కూడా ఉన్నాయి.. అలాగే త్వరలోనే ఈ ఫోన్లు మార్కెట్ లో సేల్స్ కు రాబోతున్నాయి..