Leading News Portal in Telugu

BSNL 4G: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త.. త్వరలో దేశ‌మంతా 4జీ సేవ‌లు..



Bsnl 4g

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా వినియోగదారులకు 4జీ సేవలను అందించనున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ సోమవారం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ కార్యక్రమంలో భాగంగా బీఎస్ఎన్ఎల్ స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి 4G సేవలను అందిస్తోంది. ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న పైలట్ ప్రాజెక్టులో 700 మెగాహెర్ట్జ్ నుంచి 2100 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో 40-45 ఎంబీపీఎస్ వేగంతో డేటా అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు.

Also Read: Vande Bharat: అతిత్వరలో వందే భారత్ స్లీపర్ ట్రెయిన్స్.. ఫీచర్స్ ఇలా..

ఐటి దిగ్గజాలలో ఒక్కటైనా టిసిఎస్‌తో కలిసి కేంద్ర ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థ సి-డాట్ అభివృద్ధి చేసిన యాజమాన్య సాంకేతికతను ఉపయోగించి బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే పంజాబ్‌లో 4G సేవలను అందుబాటులోకి తెచ్చింది. సీ-డాట్ అభివృద్ధి చేసిన దేశీయ టెక్నాలజీ పంజాబ్‌ లో మెరుగైన సేవలను అందిస్తుందని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు తెలిపారు.

Also Read: Shocking Dating: నీ డేటింగ్ తగలెయ్య.. ప్రాణాలను రిస్క్‌లో పెట్టి అవసరమా.. వైరల్ వీడియో..

దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు బీఎస్ఎన్ఎల్ నుండి TCS, తేజస్, ప్రభుత్వ రంగ ‘ITI’ సంయుక్తంగా 19,000 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టును గెలుచుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 1.12 లక్షల 4G & 5G టవర్‌ లను ఇన్‌స్టాల్ చేసింది, కాబట్టి భవిష్యత్తులో 4G నుండి 5Gకి మారేటప్పుడు మళ్లీ అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ కంపెనీ నాలుగేళ్లుగా కస్టమర్లకు 4జీ సేవలను అందించే సిమ్ కార్డులను విక్రయిస్తోంది. మీరు 4G సిమ్ కార్డును కలిగి ఉన్నట్లయితే చాలు ఈ 4G స్పీడ్ ఇంటర్నెట్ సేవలను ఉపయోగించుకోవచ్చు.