Leading News Portal in Telugu

Rythu Bharosa : తెలంగాణలో రైతులకు గుడ్‌న్యూస్‌.. రైతు భరోసా నిధులు విడుదల



Farmers

తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా (రైతు బంధు) నిధులను వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసింది. ఇప్పటి వరకు ఐదు ఎకరాలలోపు వారికి నిధులు విడుదల చేసిన సర్కార్.. సోమవారం ఐదు ఎకరాలు పై బడిన రైతులకు ఫండ్స్ రిలీజ్ చేసింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను వ్యవసాయ శాఖ జమ చేసింది. రూ.2వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్టు సమాచారం. మూడు రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. 5 ఎకరాలు లోపు భూమి ఉన్న రైతులకు ఇప్పటికే నిధులు విడుదలయ్యాయి. తాజాగా ఐదు ఎకరాలు పైబడిన వారికి చెల్లింపులు ప్రారంభించారు.