Leading News Portal in Telugu

Mamata Banerjee: మమతా బెనర్జీపై మీమ్.. యూజర్లకు పోలీసుల వార్నింగ్.. భగ్గుమంటున్న నెటిజన్లు..



Mamata Abanerjee

Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ‌పై మీమ్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మీమ్ క్రియేట్ చేసిన ఎక్స్ యూజర్లకు కోల్‌కతా పోలీసులు వార్నింగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ మీమ్ క్రియేట్ చేసిన వారు తమ పేరు, చిరునామా వెల్లడించాలని పోలీసులు డిమాండ్ చేశారు. ‘‘పేరు, నివాసం సహా మీ గుర్తింపును తక్షణమే బహిర్గతం చేయాలి లేకపోతే మీరు 2 CrPC చట్టపరమైన చర్యలకు బాధ్యత వహిస్తారు.’’ అని కోల్‌కతా పోలీసులు ట్వీట్ చేశారు.

కోల్‌కతా పోలీస్‌లోని సైబర్ క్రైమ్ విభాగం సోమవారం ఇద్దరు సోషల్ మీడియా వినియోగదారులకు “ఆక్షేపణీయమైన, హానికరమైన మరియు ప్రేరేపించే” వీడియోను పోస్ట్ చేసినందుకు నోటీసు పంపింది. ఆమె స్పూఫ్ వీడియోను షేర్ చేసినందుకు ఇద్దరు ఎక్స్ వినియోగదారులకు ఇలా నోటీసులు ఇచ్చింది. వీడియోను పోస్ట్ చేసిన ఎక్స్ హ్యాండిల్‌ని కూడా పోలీసులు సోషల్ మీడియాలో ట్యాగ్ చేశారు.

Read Also: Ram Mandir: రామమందిర తీర్పు రద్దు చేయాలని రాహుల్ గాంధీ ప్లాన్.. మాజీ కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు..

బెంగాల్ పోలీసులు సీఎం మమతా బెనర్జీపై ట్వీట్స్, మీమ్స్‌పై ఇలా విరుచుకుపడటం ఇదే తొలిసారి కాదు. 2022లో ఆమెపై మీమ్స్ క్రియేట్ చేసిన ఆరోపణలపై నాడియా జిల్లా నుంచి 29 ఏళ్ల యూట్యూబర్‌ని అరెస్ట్ చేశారు. మీమ్‌లను అవమానకరం అని పేర్కొంటూ, ఫిర్యాదులో మరో ఏడుగురు కంటెంట్ క్రియేటర్ల పేర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. 2019లో మమతా బెనర్జీ మార్ఫింగ్ ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినందుకు బీజేపీ యువజన విభాగం సభ్యుడిని అరెస్ట్ చేశారు.

అయితే, ఈ ఉదంతం రాష్ట్రంలో వాక్ స్వాతంత్ర్యంపై భారీ చర్చకు దారి తీశాయి. సామాన్యుడలను పోలీసులు బెదిరిస్తున్నారని, ప్రతీ మీమ్ మేకర్‌ని బెదిరిస్తారా..? ప్రతీ ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని పోలీసులు మరిచిపోకూడదు, ఇలాంటి బెదిరింపులకు భయపడబోము, వెళ్లి మమతా బెనర్జీకి చెప్పంది అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. చట్టపరంగా చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ముందస్తుగా మీ వద్ద క్లియరెన్స్ తీసుకోవాలా సార్?? అంటూ ఓ నెటిజన్ పోలీసులపై వ్యంగ్యంగా కామెంట్ చేశారు.