
దేశంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో నరేంద్ర మోడీ నిలిచిపోయారన్నారు చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి కొండా సంగీత రెడ్డి. మంగళవారం ఉదయం వికారాబాద్ పట్టణంలోని ఓల్డ్ గంజ్ ప్రాంతంలో తన భర్త గెలుపుని కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా.. కొండా సంగీత రెడ్డి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను వారికి వివరించారు. దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోతున్న నరేంద్ర మోడీని మూడవ సారి ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు.
Read Also: Teja Sajja: పవన్ కి సూపర్ హీరో సపోర్ట్..
అటు నరేంద్ర మోడీ.. ఇటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులన్నారు. ఇలాంటి వారే నిస్వార్థంతో ప్రజాసేవ చేస్తారని ఆమె తెలిపారు. మే 13న ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా తరలి వచ్చి పోలింగ్ లో పాల్గొనాలని కోరారు. మీ అమూల్యమైన ఓటును కమలం పువ్వు గుర్తుపై వేసి.. రెండు లక్షల ఓట్ల భారీ మెజార్టీతో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని సంగీతారెడ్డి కోరారు. ఇంటింటి ప్రచారంలో వికారాబాద్ జిల్లాకు చెందిన భారతీయ మహిళా మోర్చా నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: Kavitha: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..!