Leading News Portal in Telugu

Ram Charan: బాబాయ్ కి అబ్బాయి సపోర్ట్.. ఆ వీడియో షేర్ చేస్తూ!



Pr

సినీ పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ కు నెమ్మదిగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే మెగా హీరోలు వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సహా జనసేన తెలుగుదేశం బిజెపి కోటపై పోటీ చేస్తున్న పలు ప్రాంతాలకు వెళ్లి ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు ఉదయం జనసేనని గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా హీరోలు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ముందుగా నాచురల్ స్టార్ నాని తర్వాత హీరో రాజ్ తరుణ్ ఆ తర్వాత హనుమాన్ సినిమాతో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా పోస్టులు పెట్టారు.

Also Read; Teja Sajja: పవన్ కి సూపర్ హీరో సపోర్ట్..

ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కూడా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా తన తండ్రి రిలీజ్ చేసిన వీడియోని మరోసారి షేర్ చేస్తూ మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అంటూ రాసుకొచ్చారు. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి మద్దతుగా జబర్దస్త్ ఆర్టిస్టులు, కొంతమంది సీరియల్ ఆర్టిస్టులు కొంత మంది పిఠాపురం సహా రాష్ట్రంలో పోల ప్రాంతాలలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఎన్నికల విషయానికి వస్తే సరిగ్గా వారం రోజుల్లో ఏపీ ఎన్నికలు జరగబోతున్నాయి వచ్చే సోమవారం నాడు అంటే మే 13వ తేదీన ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఈ ఫలితాలు వచ్చే నెల నాలుగో తేదీన రిలీజ్ చేయబోతున్నారు.