Leading News Portal in Telugu

Tamilnadu: తొలి బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత.. ప్రధాని మోడీ సంతాపం



Bj[

తమిళనాడులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే సి.వేలాయుధం (73) బుధవారం కన్నుమూశారు. తమిళనాడు అసెంబ్లీకి బీజేపీ టిక్కెట్‌పై గెలిచిన తొలి ఎమ్మెల్యే ఈయనే. 1996లో పద్మనాభపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు.

వేలాయుధం మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. తమిళనాడులో పార్టీకి పునాది వేయడంతో పాటు పార్టీ నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యే ఘనత ఆయనకు దక్కుతుందని, వేలాయుధం వంటి నేతలు తమిళనాడులో పార్టీకి జవజీవాలు పోసి బీజేపీ అభివృద్ధి ఎజెండాను ప్రజల్లోకి తీసుకువెళ్లారని కొనియాడారు. పేదలు, అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి వేలాయుధం విశేష కృషి చేశారని గుర్తుచేశారు. వేలాయుధం కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నానని మోడీ తెలిపారు.

ఇది కూడా చదవండి: Vijay Deverakonda: రష్మికతో దేవరకొండ సినిమా.. కథ మామూలుగా ఉండదు!

అలాగే బీజేపీ అధ్యక్షుడు జేపీ.నడ్డా కూడా వేలాయుధం మృతికి సంతాపం తెలిపారు. ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు. వేలాయుధం కుటుంబ సభ్యులకు జేపీ.నడ్డా సానుభూతి తెలియజేశారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని నడ్డా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అలాగే కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు.. వేలాయుధం మృతికి సంతాపం ప్రకటించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై కూడా వేలాయుధం కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. తమిళనాడు బీజేపీ తొలి శాసనసభ్యుడు, పార్టీకి మార్గదర్శకుల్లో ఒకరైన వేలాయుధం కన్నుమూశారనే వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుందన్నారు. పార్టీ అభివృద్ధికి అంకితమైన వ్యక్తి అని కొనియాడారు.