
సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల వ్యవహారం కర్ణాటక రాజకీయాల్ని కుదిపేస్తు్న్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. ఇటీవల డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ టార్గెట్‌గా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపణలు గుప్పించారు. తాజాగా ఆయన ఈ వ్యవహారంపై స్పందించారు. ఆ దృశ్యాలు వైరల్ కావడం వెనక ఉన్నది ప్రజ్వల్ బాబాయ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామే అని ఆరోపించారు. ఆయన బ్లాక్‌మెయిలింగ్ కింగ్ అని, ఈ మొత్తం స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్, ప్రధాన పాత్రధారి ఆయనే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: KTR : క్రిశాంక్‌ను వెంటనే విడుదల చేయాలి
ప్రజ్వల్ రేవణ్ణ పెన్‌డ్రైవ్ వ్యవహారం గురించి కుమారస్వామికి మొత్తం తెలుసు అన్నారు. రాజకీయంగా ఒకరి తర్వాత ఒకరిని తొక్కేయడం ఆయన పని అని.. ఆయన బ్లాక్‌మెయిలింగ్ కింగ్ అని వ్యాఖ్యానించారు. అధికారులు, రాజకీయ నాయకులతో సహా అందరినీ బెదిరిస్తుంటారని చెప్పారు. ఆయన పని ఆయన్ను చేసుకోనివ్వండి.. సమయం వస్తుంది.. అప్పుడు అన్నింటినీ అసెంబ్లీలో చర్చిద్దామని డీకే.శివకుమార్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Google Wallet: ఇండియాలో గూగుల్ వాలెట్ లాంచ్.. ఇకపై ఇలా చేయొచ్చు!
ప్రజ్వల్ రేవణ్ణ పెన్‌డ్రైవ్ వ్యవహారంపై సిద్ధరామయ్య ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అలాగే ప్రజ్వల్‌కు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిది. ప్రస్తుతం ప్రజ్వల్ విదేశాల్లో తలదాచుకున్నారు. మరోవైపు ప్రజ్వల్ సిట్ ఎదుట లొంగిపోవాలని కర్ణాటక హోంమంత్రి తెలిపారు. లేదంటే సిట్ అరెస్ట్ చేస్తుందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Devara: దేవర షూట్ కి అడ్డంకులు.. మొన్న అలా.. నేడు ఇలా!