
ఓ కొత్త కారు ఆలయంలో బీభత్సం సృష్టించింది. పూజలు చేస్తుండగా హఠాత్తుగా ముందుకు దూసుకుపోయింది. నేరుగా వెళ్లి ఆలయ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ముందు భాగంగా పూర్తిగా దెబ్బతింది. ఈ పరిణామంతో అక్కడున్న భక్తులంతా షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా శ్రీముష్ణం ప్రాంతంలోని ఒక ఆలయంలో జరిగింది.
ఇది కూడా చదవండి: Kim Jong Un : తన ప్యాలెస్ ను తానే కూల్చుకున్న కిమ్.. ఆశ్చర్యపోతున్న అగ్రరాజ్యాలు
సుధాకర్ అనే వ్యక్తి కొత్త కారు కొనుగోలు చేశాడు. అనంతరం ఆలయంలో పూజలు చేయించేందుకు తీసుకొచ్చాడు. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత.. స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. పొరపాటున యాక్సిలరేటర్‌ను నొక్కగా ఒక్కసారిగా ముందుకు దూసుకుపోయింది. ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఆగలేదు. నేరుగా వెళ్లి ఆలయ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయింది. యజమాని మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. అలాగే ఆలయంలో ఉన్న భక్తులకు కూడా ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: KCR: నేడు కరీంనగర్లో కేసీఆర్ రోడ్ షో.. తెలంగాణచౌక్ వరకు ర్యాలీ
A man inadvertently crashed his newly purchased car into a pillar-like structure after a blessing ceremony at a temple in the #Srimushnam area of #Cuddalore district of #TamilNadu. pic.twitter.com/omC6ppCR8h
— Hate Detector
(@HateDetectors) May 8, 2024