
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధంమవుతోంది.. మరో రెండు రోజుల్లో కీలకమైన ప్రచార ఘట్టానికి తెరపడనుంది.. అన్ని పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి.. ఇక, ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ రోజు మరో మూడు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించబోతున్నారు.. ఉదయం 10.35 గంటలకు కర్నూలు చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్.. స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ సర్కిల్ లో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. ఇక, అనంతరం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న జగన్.. మధ్యాహ్నం 1:30 గంటలకు సభ ఉద్దేశించి మాట్లాడనున్నారు.. ఇక, అక్కడ నుంచి అన్నమయ్య జిల్లా పర్యటనకు వెళ్తారు వైసీపీ అధినేత.. రాజంపేట లో ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార బహిరంగ సభ ఉండనుంది.. పాత బస్టాండ్ కూడలిలో మధ్యాహ్నం 3 గంటలకు సభ నిర్వహించనున్నారు.. ఈ సభలో సీఎం జగన్ పాల్గొంటారు.. మొత్తంగా ఈ రోజు మూడు నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొననున్నారు సీఎం జగన్.. ఇక, జగన్ సభలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు.
Read Also: Peddapalli Campaign: పెద్దపల్లిలో వింత ప్రచారం.. ఓటర్ల కాళ్లు పట్టుకున్న అభ్యర్థి